Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

యాషెస్: సచిన్ కొడుకుతో ఇంగ్లాండ్ ప్రాక్టీస్, చిట్కాలు

Posted by:
Published: Thursday, July 16, 2015, 13:35 [IST]

లండన్: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ తనయుడు అర్జున్ టెండుల్కర్ ప్రస్తుతం ఇంగ్లాండు నెట్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. యాషెస్ రెండో టెస్టు నేపథ్యంలో అర్జున్ ఇంగ్లాండులో బౌలింగులో శిక్షణ తీసుకుంటున్నాడు.

అర్జున్‌ అప్పుడప్పుడూ భారత ఆటగాళ్లతో కలిసి ప్రాక్టీస్‌ చేయడం మనం చూస్తూనే ఉంటాం. బుధవారం మాత్రం అతను ఇంగ్లాండ్‌ ఆటగాళ్లతో కనిపించాడు. యాషెస్‌ సిరీస్‌లో భాగంగా రెండో టెస్టు కోసం లార్డ్స్‌ లో సాధన చేస్తున్న ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌కు అర్జున్‌ బౌలింగ్‌ చేశాడు.

Arjun Tendulkar bowls in England nets

ఎలాంటి భయం లేకుండా తమ బ్యాట్స్‌మెన్‌కు బంతులు విసురుతున్న అతడి బౌలింగ్‌ను కెప్టెన్‌ కుక్‌ కొద్దిసేపు పరిశీలించాడు. ఆ జట్టు బౌలింగ్‌ కోచ్‌ ఒటిస్‌ గిబ్సన్‌ అర్జున్‌కు చిట్కాలు చెప్పాడు. అర్జున్‌ టెండుల్కర్ ఇంగ్లాండ్‌లో శిక్షణ పొందుతున్నాడు.

English summary
Arjun Tendulkar bowls in England nets
మీ వ్యాఖ్య రాయండి