Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

జింబాబ్వేపై క్లీన్ స్వీప్‌‌తో భారత్‌కు రెండో స్ధానం

Posted by:
Updated: Thursday, July 16, 2015, 17:41 [IST]

దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) గురువారం తాజా వన్డే ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. జింబాబ్వేపై 3-0తో సిరిస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా 115 పాయింట్లతో రెండో స్ధానంలో నిలవగా 129 పాయింట్లతో ఆస్టేలియా మొదటి స్ధానంలో నిలిచింది.

ఇక బంగ్లాదేశ్‌లో జరిగిన హోం సిరిస్‌లో దక్షిణాఫ్రికాపై 2-1తో విజయం సాధించిన బంగ్లాదేశ్ జట్టు వరుసగా నాలుగు హోం సిరిస్‌లను సొంతం చేసుకుని 96 పాయింట్లతో ఏడవ ర్యాంకుని సొంతం చేసుకుంది. దక్షిణాఫ్రికాపై బంగ్లాదేశ్ సాధించిన 2-1 సిరిస్ విజయంతో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2017కి అర్హత సాధించింది.

112 పాయింట్లతో న్యూజిలాండ్ మూడో స్ధానాన్ని సొంతం చేసుకోగా, 109 పాయింట్లతో దక్షిణాఫ్రికా ఐదో స్ధానంలో నిలిచింది. దుబాయ్‌లో ఐసీసీ గురువారం తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్ ఇలా ఉన్నాయి.

ICC ODI Rankings: India retain 2nd spot after clean sweep over Zimbabwe

(ర్యాంకు, జట్టు, పాయింట్లు)
1. Australia (129)
2. India (115)
3. New Zealand (112)
4. South Africa (109)
5. Sri Lanka (105)
6. England (98)
7. Bangladesh (96)
8. West Indies (88)
9. Pakistan (88)
10. Ireland (50)
11. Zimbabwe (43)
12. Afghanistan (41)

Story first published:  Thursday, July 16, 2015, 16:07 [IST]
English summary
India have retained their 2nd position in the latest ICC ODI Rankings which were released today.
మీ వ్యాఖ్య రాయండి