Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

దాల్మియాకు అస్వస్థత: బిసిసిఐకి కొత్త అధిపతి?

Published: Friday, July 17, 2015, 13:14 [IST]

న్యూఢిల్లీ: పదేళ్ల తర్వాత, గత మార్చిలో తిరిగి భారత క్రికెట్ నియంత్రణ మండలి(బిసిసిఐ) పగ్గాలు చేపట్టిన జగ్మోహన్‌ దాల్మియా త్వరలోనే ఆ బాధ్యతల నుంచి తప్పుకునే పరిస్థితి ఏర్పడింది. 75 ఏళ్ల వయసులో అనారోగ్యంతో బాధపడుతుండడమే అందుకు కారణమవుతోంది.

ఈ నేపథ్యంలో సెప్టెంబర్‌లో జరిగే సర్వసభ్య సమావేశం తర్వాత బిసిసిఐకి కొత్త అధ్యక్షుడు వచ్చే అవకాశముంది. అనారోగ్యంతో బాధపడుతున్నందున పదవి నుంచి తప్పుకోవాలని దాల్మియాకు ఎక్కువ మంది సభ్యులు విజ్ఞప్తి చేసే అవకాశముందని భావిస్తున్నారు.

‘కొంత కాలంగా దాల్మియా ఆరోగ్యం బాగుండట్లేదు. బోర్డు కార్యకలాపాలు సవ్యంగా సాగాలంటే అతడు తప్పుకోవడం అవసరం' అని ఎక్కువ మంది బిసిసిఐ సభ్యులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

BCCI chief Jagmohan Dalmiya may step down on health grounds: report

కేంద్రమంత్రి అరుణ్ జైట్లీతో జోక్యం కోరనున్న సభ్యులు

బిసిసిఐ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాల్సిందిగా దాల్మియాను కోరాలని కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీని కోరతామని బిసిఐఐ అధికారులు కొందరు చెప్పారు. ‘జైట్లీ ఏం చెబితే అది చేస్తానని.. దాల్మియా బిసిసిఐ అధ్యక్ష పదవి చేపట్టే ముందు చెప్పారు' అని వారు తెలిపారు. ఒకవేళ దాల్మియా వైదొలిగితే మహారాష్ట్ర క్రికెట్‌ సంఘం అధ్యక్షుడు అజయ్‌ షిర్కే అధ్యక్ష పదవికి బలమైన అభ్యర్థి అవుతాడని బోర్డు వర్గాల తెలిపాయి. షిర్కే గతంలో బిసిసిఐ కోశాధికారిగా పని చేశాడు.

కాగా, ‘ఒకరకంగా అనురాగ్‌ ఠాకూరే ఇప్పుడు కార్యదర్శిగానూ అధ్యక్షుడిగానూ పని చేస్తున్నాడు. బిసిసిఐ లాంటి సంస్థకు పూర్తి ఫిట్‌గా ఉన్న అధ్యక్షుడు అవసరం. భారత క్రికెట్‌కు దాల్మియా ఏం చేశాడో మా అందరికీ తెలుసు. కానీ ప్రస్తుతం అతడి ఆరోగ్యం బాగా లేదు. అతడు తప్పుకోవాలి. బిసిసిఐ వచ్చే ఏడాది ఐసిసి టి20 ప్రపంచకప్‌కు ఆతిథ్యమివ్వనుంది. వచ్చే నెలల్లో బోర్డు ఇంకా అనేక కీలక నిర్ణయాలు తీసుకోవాల్సివుంది' అని ఓ సీనియర్ బిసిసిఐ అధికారి తెలిపారు.

ఇటీవల బిసిసిఐ దైనందిన కార్యకలాపాలను దాల్మియా కొడుకు అవిశేక్‌ చూస్తుండడం బోర్డు అధికారులకు ఆశ్చర్యం కలిగిస్తోంది. కొన్ని వారాల కింద కోల్‌కతాలో జరిగిన బిసిసిఐ వర్కింగ్‌ కమిటీ సమావేశానికి హాజరైన సభ్యులు దాల్మియా ఆరోగ్య స్థితి చూసి బాధపడ్డారని అధికారులు చెప్పారు.

English summary
The Board of Control for Cricket in India (BCCI) president Jagmohan Dalmiya could be asked to step down on health grounds and the board could have a new chief after the Annual General Meeting in September, according to a report in The Indian Express.
మీ వ్యాఖ్య రాయండి