Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

సీఎంను కలిసిన ధోని: చెన్నై వేటుపై నో కామెంట్

Posted by:
Updated: Friday, July 17, 2015, 19:03 [IST]

రాంచీ: ఐపీఎల్‌లో చెన్నై జట్టు నిషేధంపై స్పందించడానికి నిరాకరించారు టీమిండియా వన్డే కెప్టెన్ ధోని. జార్ఖండ్‌ ముఖ్యమంత్రి రఘువర్‌ దాస్‌ను మహేంద్రసింగ్‌ ధోనీ గురువారం కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ధోనికి జ్ఞాపికను అందజేశారు.

మంగళవారం (జులై 14)న చెన్నై, రాజస్థాన్ రాయల్స్ జట్లపై రెండేళ్ల పాటు నిషేధం విధిస్తూ సుప్రీం కోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రాజేంద్ర మాల్ లోధా సారథ్యంలోని ముగ్గురు సభ్యుల కమిటీ తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం రఘువర్ దాస్ గురువారం ధోనిని తన ఇంటికి ఆహ్వానించారు.

Captain Dhoni meets Jharkhand CM; refuses to comment on CSK ban

దాదాపు అరగంట సేపు ధోనితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాజకీయ నాయకుడిగా జీవితంలో ఎత్తుపల్లాలు తెలుసని అన్నారు. రాజకీయ నాయకుల్లానే క్రీడాకారుల కేరీర్‌లో కూడా ఎత్తు పల్లాలు ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రతి ఎన్నికల్లో తామెలా విజయం సాధించలేమో, అలాగే క్రీడాకారులు కూడా ప్రతి మ్యాచ్‌లో విజయం సాధించలేరని అన్నారు. గతంలో జార్ఖండ్‌లో క్రికెట్ అకాడమీ ప్రారంభించేందుకు అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ధోని సీఎంను కోరారు.

దీనిపై ధోనిని మీడియాతో మాట్లాడుతూ తాను తొలిసారి సీఎంను కలిశానని, ఆవిషయంలో ప్రభుత్వం నుంచి మంచి స్పందనే వస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్. శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మేయప్పన్, బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాలను క్రికెట్, దాని సంబంధిత కార్యకలాపాల నుంచి జీవితకాలం నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. వారిద్దరూ ఐపీఎల్ ప్రతిష్టను దిగజార్చారని లోథా కమిటీ స్పష్టం చేసింది.

2008 ఐపీఎల్‌ వేలంలో ధోనీని చెన్నై కొనుగోలు చేసింది. జట్టును ఆరుసార్లు ఫైనల్‌కు చేర్చడంలో ధోనిదే కీలకపాత్ర. చెన్నై సూపర్ కింగ్స్ రెండుసార్లు టైటిల్‌ సాధించింది. ధోనీ కెప్టెన్సీలో టీమిండియా ఎలాంటి ఘన విజయాలు సాధించిందో.. ఐపీఎల్‌లోనూ చెన్నై జట్టు అలాంటి విజయాలనే సొంతం చేసుకుంది.

జింబాబ్వే పర్యటనలో సీనియర్లు ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సురేష్ రైనాలకు విశ్రాంతి నిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని క్రీడలకు సంబంధించిన వివిధ అంశాలపై జార్ఖండ్‌ ముఖ్యమంత్రి రఘువర్‌ దాస్‌‌తో ధోని చర్చించినట్లు తెలుస్తోంది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నైపై నిషేధం విధించిన నేపథ్యంలో ధోనీ మరో ఫ్రాంచైజీతో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటాడో లేదో చూడాలి. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్‌ జట్టుల ఆటగాళ్లను వేలంలో ఉంచితే మొత్తం 45 మందికి మిగిలిన ఆరు టీమ్‌ల్లో చోటు దక్కడం కష్టమే అంటున్నారు క్రికెట్ నిపుణులు.

Story first published:  Friday, July 17, 2015, 13:55 [IST]
English summary
India's ODI captain MS Dhoni refused to comment on the suspension of Chennai Super Kings (CSK) as he met Jharkhand Chief Minister Raghubar Das on Thursday (July 16).
మీ వ్యాఖ్య రాయండి