Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

రాజస్థాన్‌పై వేటు: రహానే ఏమన్నాడు? లోథా సూచన

Posted by:
Published: Friday, July 17, 2015, 13:29 [IST]

హరారే: ఐపిఎల్ నుండి రాజస్థాన్ రాయల్స్ సస్పెన్షన్ పైన.. జింబాబ్వే పర్యటనలో భారత్‌కు సారథ్యం వహిస్తున్న అజింక్యా రహానే స్పందించలేదు. స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లను రెండేళ్ల పాటు నిషేధించిన విషయం తెలిసిందే.

అజింక్యా రహానే ఐపిఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అతను జింబాబ్వే టూర్లో ఉన్నాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టు పైన వేటు పడటంపై మీడియా ప్రశ్నించింది.

దీనిపై రహానే స్పందిస్తూ... ప్రస్తుతం తన ఫోకస్ అంతా మిగతా రెండు టి ట్వంటీల పైనే ఉందని చెప్పాడు. ఐపిఎల్ గురించి ఇప్పుడు ఆలోచించడం లేదన్నాడు. ప్రస్తుతం తాను భారత్ తరఫున ఆడేందుకు వచ్చామని, దాని గురించే ఆలోచించాలని, ఇక్కడి గెలుపు పైనే దృష్టి సారించాలన్నాడు.

IPL: What did India captain Rahane say on RR suspension?

తాము ప్రస్తుతం మంగళవారం నాడు పూర్తిగా మూడో వన్డే పైనే దృష్టి సారించామని చెప్పాడు. ఆ గెలుపు అనంతరం ఇప్పుడు టీ ట్వంటీ పైన దృష్టి సారించామని చెప్పాడు. జింబాబ్వే పైన గెలుపే తమ లక్ష్యమని చెప్పాడు.

ఆరు జట్ల ప్రసక్తే లేదు

ఐపీఎల్ కుంభకోణానికి సంబంధించి చెన్నై సూపర్‌కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలపై వేడుపడినా, ఈ ప్రభావం వచ్చే ఐపీఎల్‌పై ఉండదని లీగ్ చైర్మన్ రాజీవ్ శుక్లా అన్నారు. రెండు జట్లు లీగ్‌కు దూరమైనా, మొత్తం ఎనిమిది జట్లతోనే వచ్చే సీజన్‌ను నిర్వహించి తీరుతామని శుక్లా స్పష్టం చేశారు. ఐపీఎల్‌పై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నాడు.

ఆ రెండు జట్లను బోర్డు బహిష్కరించవచ్చు

సుప్రీం నియమించిన లోధా కమిటీ చెన్నై, రాజస్థాన్ జట్లను రెండేండ్లపాటు నిషేధించాలని ప్రతిపాదించింది. మరి దీనిపై బీసీసీఐ ఆదివారం జరిగే పాలకవర్గం సమావేశంలో ఏం నిర్ణయం తీసుకోనుందో? దీనికి స్వయంగా మాజీ చీఫ్ జస్టిస్ లోథాయే ఓ మార్గం చూపారు. బీసీసీఐ అనుకుంటే, ఈ రెండు ఫాంచైజీల్ని ఐపీఎల్ నుంచి బహిష్కరించవచ్చని తెలిపారు. జట్లను బహిష్కరించాలనే అంశం బీసీసీఐ పరిధిలోనిది.

English summary
India's stand-in ODI captain Ajinkya Rahane, who plays for Rajasthan Royals (RR) in the Indian Premier League (IPL), has said his focus is on national duty at the moment and not on the news of RR's suspension.
మీ వ్యాఖ్య రాయండి