Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

తొలి టీ20 భారత్‌దే: సత్తా చాటిన భారత్ బౌలర్లు

Posted by:
Updated: Friday, July 17, 2015, 19:49 [IST]

హరారే: హరారే వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. 179 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లను కోల్పోయి 124 పరుగులు చేసింది. దీంతో తొలి టీ20లో జింబాబ్వేపై భారత్ 54 పరుగుల తేడాతో విజయం సాధించింది.

జింబాబ్వే బ్యాట్స్‌మెన్లలో ఓపెనర్లు చిబాబ 23, మసకద్జ 28 అత్యధిక పరుగులు సాధించారు. భారత్ బౌలర్లలో అక్షర పటేల్ మూడు వికెట్లు తీసుకోగా, హర్భజన్ సింగ్ రెండు వికెట్లు, శర్మ ఒక వికెట్ తీసుకున్నారు.

పరుగుల వేటలో జింబాబ్వే తడబాటు:

హరారే వేదికగా జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో 179 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే విజయం సాధించాలంటే 38 బంతుల్లో 97 పరగులు చేయాల్సి ఉంది. ధాటిగా ఆడే సందర్భంలో జింబాబ్వే స్వల్ప ఓవర్ల పరిధిలో 4 వికెట్లను కోల్పోయింది.

భారత బౌలర్లు అక్షర పటేల్ ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసుకోగా, హర్భజన్ సింగ్ రెండు వికెట్లను తీసుకున్నాడు. దీంతో జింబాబ్వే టాప్ ఆర్డర్ కుప్పకూలింది. ప్రస్తుతం జింబాబ్వే 14.3 ఓవర్లకు 5 వికెట్లను నష్టపోయి 86 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో సికిందర్ రాజా 9, క్రీమెర్ 3 పరుగులతో ఉన్నారు.

7 ఓవర్లు ముగిసే సమయానికి జింబాబ్వే 50 పరుగులు చేసింది. ఓపెనర్లు చిబాబ 23, మసకద్జ 28 మంచి ఆరంభాన్నిచ్చారు. భారత్ నిర్దేశించిన 179 పరుగుల లక్ష్యాన్ని చేధించడానికి జింబాబ్వే బరిలోకి దిగింది. లక్ష్య చేధనలో భాగంగా జింబాబ్వే ఆటగాళ్లు బ్యాటింగ్‌ను ఆరంభించారు. జింబాబ్వే ఐదు ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 31 పరుగులు చేసింది.

179 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన జింబాబ్వే ఆచితూచి ఆడుతోంది. హరారే వేదికగా జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ నిర్ణీత ఓవర్లలలో 5 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. దీంతో జింబాబ్వే విజయ లక్ష్యం 179 పరుగులుగా నిర్దేశించింది. జట్టులో అత్యధికంగా రాబిన్ ఊతప్ప 39 పరుగులు చేయగా ఆ తర్వాత మురళీ విజయ్ 34, రహానే 33, పాండే 19, బిన్నీ 11, కేదార్ జాదవ్ 9 పరుగులు చేశారు.

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్:

జింబాబ్వే బౌలర్లలో పొఫు మూడు వికెట్లు తీసుకోగా, క్రీమెర్ ఒక వికెట్ తీసుకున్నాడు. 166 పరుగుల స్కోరు వద్ద టీమిండియా ఐదో వికెట్‌ను కోల్పోయింది. దూకుడు పెంచే క్రమంలో స్టువర్ట్ బిన్నీ 11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద పొఫు బౌలింగ్‌‌లో క్రీమెర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా దూకుడుగా ఆడుతున్న బ్యాట్స్‌మెన్లను జింబాబ్వే బౌలర్లు కట్టడి చేస్తున్నారు. దూకుడుగా ఆడే క్రమంలో కేదార్ జాదవ్ 9 పరుగుల వద్ద అవుటయ్యాడు. దీంతో 17.3 ఓవర్లకు గాను 4 వికెట్లను కోల్పోయిన భారత్ 150 పరుగులు చేసింది.

LIVE: 1st T20I: Rahane wins his first toss, India bat

టీమిండియా 17 ఓవర్లకు గాను 3 వికెట్లను నష్టపోయి 148 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో క్రీజులో రాబిన్ ఊతప్ప 31, కేదార్ జాదవ్ 8 పరుగులతో ఉన్నారు. భారత్‌ 127 పరుగుల వద్ద మూడో వికెట్‌ కోల్పోయింది. 19 పరుగులు చేసిన మనీశ్‌ పాండే, పొఫు బౌలింగ్‌‌లో సికందర్‌ రజాకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 16 ఓవర్లకు గాను 3 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది.

భారత్ 15 ఓవర్లకు గాను 123 పరుగులు సాధించింది. జింబాబ్వేతో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. దూకుడు పెంచే క్రమంలో రహానే 33 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కెప్టెన్ వెనుదిరిగాడు. భారత్‌ 100 పరుగుల మార్క్‌ను దాటింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు మురళీ విజయ్‌(34), రహానె(33) అద్భుత ఆరంభాన్నిచ్చారు.

వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో వెనుదిరగడంతో ప్రస్తుతం ఉతప్ప(9), మనీశ్‌ పాండే(9) పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. దీంతో టీమిండియా 12 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసింది.

జింబాబ్వేతో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 34 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మురళీ విజయ్ రనౌట్‌గా పెవలియన్‌కు చేరుకున్నాడు. ప్రస్తుతం క్రీజులో రహానే 33, రాబిన్ ఊతప్ప 5 పరుగులతో ఉన్నారు. అంతక ముందు 6 ఓవర్లు ముగిసేసరికి వికెట్‌ నష్టపోకుండా 58 పరుగులు చేసింది.

జింబాబ్వేతో తొలి టీ20 మ్యాచ్‌‌లో భాగంగా టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. జింబాబ్వేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో సాయంత్రం 4:30 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభం కానుంది. జింబాబ్వేతో జరిగిన మూడు వన్డేల సిరిస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా, రెట్టింపు ఉత్సాహాంతో ట్వంటీ20 సిరిస్‌పై కూడా కన్నేసింది.

వన్డే సిరిస్‌లో ఓటమి పాలైన జింబాబ్వే కనీసం టీ20 సిరిస్‌నైనా గెలుచుకుని పరువు దక్కించుకోవాలని భావిస్తోంది. వన్డే సిరిస్‌లో మ్యాన్ ఆఫ్ ద సిరిస్ అవార్డు అందుకున్న తెలుగుతేజం అంబటి రాయుడు గాయం కారణంగా టీ20 మ్యాచ్‌ నుంచి తప్పుకున్నాడు. చివరి వన్డే మ్యాచ్‌కు దూరమైన సంగతి తెలిసిందే.

ఇండియా: అజింక్య రహానె (కెప్టెన్), రాబిన్ ఉతప్ప (వికెట్కీపర్), మురళీ విజయ్, స్టువర్ట్ బిన్నీ, మనోజ్ తివారీ, హర్భజన్ సింగ్, కేదార్ జాదవ్, ధావల్ కులకర్ణి, భువనేశ్వర్ కుమార్, మనీష్ పాండే, అక్షర పటేల్, సందీప్ శర్మ, సంజు సామ్సన్ (వికెట్ కీపర్), మోహిత్ శర్మ.

జింబాబ్వే: ఎల్టన్ చిగుంబుర (కెప్టెన్), రెగిస్ చకాబా (వికెట్ కీపర్), గ్రేమ్, నెవిల్లె మాడ్విజ, హామిల్టన్ మస్కదా, రిచ్మండ్ ముతాంబామి (వికెట్ కీపర్), తినాషే పన్యాంగారా, సికందర్ రజా, డోనాల్డ్ తిరిపనా, ప్రోస్పర్ ఉత్సెయా, బ్రియాన్ వెటోరి, మాల్కం వాలర్, సీన్ విలియమ్స్.

Story first published:  Friday, July 17, 2015, 16:35 [IST]
English summary
India captain Ajinkya Rahane won his first toss of the tour and opted to bat in the opening of the two Twenty20 Internationals against Zimbabwe here at the Harare Sports Club on Friday.
మీ వ్యాఖ్య రాయండి