Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

మై మదర్స్ స్క్రాప్‌బుక్: ద్రావిడ్ జ్ఢాపకాలు, వారిపై జాలి

Posted by:
Updated: Tuesday, July 21, 2015, 13:53 [IST]

న్యూఢిల్లీ: క్రికెట్‌ దిగ్గజం రాహుల్‌ ద్రావిడ్‌ తన జీవితంలోని మధుర జ్ఞాపకాలను గుర్తుకు చేసుకున్నాడు. బాల్యం నుంచి అంతర్జాతీయ క్రికెట్‌ వరకు తన జీవిత ప్రయాణంలోని కీలక ఘట్టాలన్నింటికీ సంబంధించిన ఛాయా చిత్రాలతో ఓ వీడియోను రూపొందించాడు.

4నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోను 'మై మదర్స్‌ స్క్రాప్‌బుక్‌' పేరుతో అతడు ఫేస్‌బుక్‌లో పెట్టాడు. ద్రావిడ్‌ చిన్నప్పుడు బ్యాట్‌ పట్టిన అరుదైన చిత్రాలు, స్కూల్‌ క్రికెట్‌ మ్యాచ్‌లు ఆడినప్పుడు అతడి గురించి వచ్చిన పత్రికా కథనాలు ఇలా ఎన్నో విశేషాలు అందులో ఉన్నాయి. ఈ వీడియోకు మంచి స్పందన వస్తోంది.

కాగా, ఐపీఎల్ బెట్టింగ్ కుంభకోణంలో సుప్రీంకోర్టు నియమించిన లోథా కమిటి ఇచ్చిన తీర్పును గౌరవించాల్సిందేనని ద్రావిడ్ అభిప్రాయపడిన విషయం తెలిసిందే. ఎంతో సమాచారం సేకరించిన తర్వాతే ఈ నిర్ణయాన్ని వెల్లడించి వుంటుందని, అందువల్ల ఆ తీర్పును శిరసావహించాల్సిందేనని చెప్పాడు.

Rahul Dravid's Rare and Unseen Pictures

చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలపై లోథా కమిటీ రెండేళ్ల నిషేధంపై ద్రావిడ్ స్పందిస్తూ... ఐపీఎల్ ఫిక్సింగ్ వ్యవహారంలో సుప్రీం కోర్టు నియమించిన కమిటీ నిర్ణయాలను గౌరవిస్తానన్నాడు. అయితే, ఆ జట్ల ఆటగాళ్ల పరిస్థితి చూస్తే జాలేస్తుందన్నారు.

కొన్నిసందర్భాల్లో ఒకరిద్దరు చేసే తప్పులు ఎందరిపైనో ప్రభావం చూపుతాయన్నారు. ప్రస్తుతం ఇదే జరిగిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టాప్ ఆటగాళ్లు, కోచ్‌లు ఏదో ఒక జట్టులో చేరిపోతారని. కానీ, యువ ఆటగాళ్ల విషయం అంత సులువుగా కాదని, వారిని చూస్తే బాధేస్తోందన్నారు.

Story first published:  Sunday, July 19, 2015, 15:28 [IST]
English summary
Rahul Dravid's Rare and Unseen Pictures: 'My Mother's Scrapbook' Takes You Back to His Childhood and Cricketing
మీ వ్యాఖ్య రాయండి