Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

టెస్టుల్లో గెలిచేందుకు సహాయం చేయి: భజ్జీతో కోహ్లీ

Posted by:
Published: Monday, July 20, 2015, 15:31 [IST]

హరారే: గత నెలలో టెస్టుల్లో తిరిగి చోటు దక్కించుకున్న టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌ను టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ సలహా కోరాడు. జూన్ 10న బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌ కోసం సెలక్టర్లు హర్భజన్ సింగ్‌ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.

అయితే రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భజ్జీ రాక చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. భజ్జీని బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్ కోసం ఎంపిక చేయడానికి గల ముఖ్య కారణం బంగ్లాదేశ్ జట్టులో ఎక్కువ మంది ఆటగాళ్లు ఎడమచేతివాటం బ్యాట్స్‌మెన్లు కావడమే.

వర్షం కారణంగా నిలిచినపోయిన ఆ టెస్టు మ్యాచ్‌లో టీమిండియా స్ఫిన్నర్లు భజ్జీ, అశ్విన్ ఆడారు. డ్రాగా ముగిసిన టెస్టు మ్యాచ్‌లో భజ్జీ 3 వికెట్లు తీసుకోగా, అశ్విన్ 5 వికెట్లు తీసుకున్నాడు. మార్చి 2013 నుంచి జూన్ 2015 ముందు వరకు భజ్జీ టీమిండియా తరుపున ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఆడకపోవడం విశేషం.

Captain Virat Kohli to Harbhajan Singh: 'Help us win Test matches'

జులై 19న బీసీసీఐ టీవికి ఇచ్చిన ఇంటర్యూలో భజ్జీ మాట్లాడుతూ నేను డ్రస్సింగ్ రూంలోకి వెళ్లి నా చుట్టూ చూశాను. చాలా వరకు అన్ని కొత్త ముఖాలే. జట్టులో చాలా మంది కొత్త ఆటగాళ్లు ఉన్నందుకు సంతోషం వేసిందని తెలిపారు.

102 టెస్టు మ్యాచ్‌లాడిన హర్భజన్ సింగ్ జట్టు విజయం సాధించాలంటే నేం చేయాలో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఏం చేయాలనే విషయాన్ని వెల్లడించాడు. డ్రస్సింగ్ రూమ్‌లో జట్టును ఉద్దేశించి కోహ్లీ మాట్లాడుతూ నన్ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశాడు.

20 వికెట్లు తీసి మా విజయంలో కీలక పాత్ర పోషించాలని కోరాడు. టెస్టు మ్యాచ్‌ల్లో విజయం సాధించాలనేది తమ లక్ష్యమని, ఆ లక్ష్యాన్ని సాధించాలంటే నీ సాయం తప్పక జట్టుకు ఉండాలని కోరాడని తెలిపాడు. కష్ట సమయంలో వికెట్లు ఎలా తీయాలో, నీ అనుభవాన్ని తోటి బౌలర్లకు సాయం చేయాలని కోరాడని పేర్కొన్నాడు.

ఇక జట్టు డైరెక్టర్‌గా ఉన్న రవిశాస్త్రి మాటలు జట్టులోని ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపుతాయని పేర్కొన్నాడు. ఆ మాటలే నన్ను జట్టుకు ఎంతో ముఖ్యమైన ఆటగాడిగా ఉండేలా చేస్తాయని అన్నాడు. సరిగ్గా చెప్పాలంటే రెండు సంవత్సరాల క్రితం ఎలాగైతే నే ఉన్నానో అలాగేనని తెలిపాడు.

English summary
Veteran off-spinner Harbhajan Singh, who made a comeback to the Indian team last month, is set to be a part of the Test team for a long time going by what captain Virat Kohli has told him.
మీ వ్యాఖ్య రాయండి