Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

పాక్‌తో మ్యాచ్: మైదానంలోకి రాళ్లు విసిరిన ప్రేక్షకులు

Posted by:
Published: Monday, July 20, 2015, 15:24 [IST]

కొలంబో: శ్రీలంక - పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా స్టేడియంలో ఉన్న ప్రేక్షకుల మధ్య గొడవ జరగడంతో దాదాపు అరగంట పాటు ఆట నిలిచిపోయింది. ప్రేక్షకుల మధ్య గొడవ అని, కాదు కాదు శ్రీలంక ఓటమి భరించలేక అని వార్తలు వస్తున్నాయి.

మ్యాచ్‌ సందర్భంగా స్టాండ్స్‌లో ఘర్షణ చెలరేగింది. ఛేదనలో శ్రీలంక 158/7తో ఉన్న దశలో సంఘటన జరిగింది. కొందరు ప్రేక్షకులు రాళ్లు, ఇతర వస్తువులు విసరడం మొదలు పెట్టారు.

Violence mars Pakistan's big win

శ్రీలంక ఓటమి దిశగా సాగుతుండడాన్ని జీర్ణించుకోలేని ఓ ప్రేక్షకుడు విసిరిన రాయి మైదానంలో పడింది. రిఫరీ శ్రీనాథ్‌ ఆటను అరగంట పాటు సస్పెండ్‌ చేశాడు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చాక మ్యాచ్‌ తిరిగి ప్రారంభమైంది. మ్యాచ్ ఆగిన సమయంలో ఆటగాళ్లను డ్రెస్సింగ్ రూంలోకి పంపించారు.

కాగా, శ్రీలంక పర్యటనలో పాకిస్థాన్‌ జోరు ఆదివారం కొనసాగింది. ఆదివారం మూడో వన్డేలో పాక్‌ 135 పరుగుల భారీ తేడాతో ఆతిథ్య లంకను చిత్తు చేసింది. సర్ఫ్‌రాజ్‌ అహ్మద్‌ (77), హఫీజ్‌ (54), అజహర్‌ అలీ (49), షెజాద్‌ (44), షోయబ్‌ మాలిక్‌ (44) మెరవడంతో మొదట పాక్‌ నాలుగు వికెట్లకు 316 పరుగులు చేసింది.

ఛేదనలో శ్రీలంక తీవ్రంగా తడబడింది. లెగ్‌ స్పిన్నర్‌ యాసిర్‌ షా (4/29) ధాటికి 41.1 ఓవర్లలో 181 పరుగులకే కుప్పకూలింది. థిరిమానె (56) టాప్‌ స్కోరర్‌. ఈ విజయంతో ఐదు వన్డేల సిరీస్‌లో పాక్‌ 2-1 ఆధిక్యం సాధించింది.

English summary
Sarfraz Ahmed scored 77 and Yasir Shah grabbed four wickets as Pakistan thrashed Sri Lanka by 135 runs in the violence-hit third one-day international in Colombo on Sunday.
మీ వ్యాఖ్య రాయండి