Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

భారత్‌కు షాక్: టి20ని సమం చేసిన జింబాబ్వే

Published: Monday, July 20, 2015, 11:45 [IST]

హరారే: భారత్, జింబాబ్వే జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్‌ల టీ20 ఇంటర్నేషనల్ సిరీస్ డ్రాగా ముగిసింది మొదటి మ్యాచ్‌లో భారత్ గెలవగా, ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌ని జింబాబ్వే 10 పరుగుల తేడాతో సొంతం చేసుకుంది. విజయానికి 20 ఓవర్లలో 146 పరుగులు చేయాల్సి ఉండగా భారత్ తొమ్మిది వికెట్లకు 135 పరుగులు సాధించగలిగింది.

మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 0-3 తేడాతో వైట్‌వాష్ వేయించుకున్న జింబాబ్వే ఆ తర్వాత మొదటి టి-20 కోల్పోయింది. అయితే, చివరిదైన రెండో టి-20లో గెలిచి, క్లీన్‌స్వీప్ నుంచి బయటపడింది. చాము సిబాబా బ్యాటింగ్‌లో, గ్రేమ్ క్రెమర్ బౌలింగ్‌లో రాణించి ఆ జట్టుకు విజయాన్ని అందించారు.

టాస్ గెలచిన జింబాబ్వే తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. జట్టు స్కోరు 28 పరుగుల వద్ద హామిల్టన్ మసకజా (19)వికెట్‌ను కోల్పోయింది. ఆతర్వాత వరుసగా కెప్టెన్ సికందర్ రజా (8), సీన్ విలియమ్స్ (17), చార్లెస్ కోవెంట్రీ (4) వికెట్లు కూలాయి. ఒంటరి పోరాటం జరిపిన చిబాబా 51 బంతులు ఎదుర్కొని, 9 ఫోర్లతో 67 పరుగులు చేసి భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు.

Zimbabwe win last-over thriller to deny India double whitewash

అతడ్ని మినహాయిస్తే, జింబాబ్వే జట్టులో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. క్రెగ్ ఎర్విన్ 7, ప్రాస్పర్ ఉత్సేయ ఒక పరుగు చేయగా, మాల్కం వాలర్ (6), గ్రేమ్ క్రెమర్ (0) నాటౌట్‌గా నిలిచారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, మోహిత్ శర్మ చెరి రెండు వికెట్లు పడగొట్టారు.

టీ20 సిరీస్‌లోనూ క్లీన్‌స్వీప్ సాధించేందుకు 146 పరుగులు చేయాల్సిన భారత్ ఆ స్థాయిలో ఆడలేకపోయింది. వికెట్‌కీపర్, బ్యాట్స్‌మన్ రాబిన్ ఉతప్ప 42 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. స్టువర్ట్ బిన్నీ చేసిన 24 పరుగులే రెండో ఉత్తమ స్కోరు. కెరీర్‌లో మొదటి టీ20 మ్యాచ్ ఆడిన సంజూ శామ్సన్ 19 పరుగులతో మూడో ఉత్తమ స్కోరును నమోదు చేశాడు.

మిగతా వారు అంతకంటే తక్కువ పరుగులకే వెనుదిరగడం భారత బ్యాటింగ్ వైఫల్యానికి నిదర్శనం. జింబాబ్వే బౌలింగ్‌ను, ప్రత్యేకించి క్రెమెర్ బంతులను ఆడటంలో భారత బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. ఆలౌట్ కాకుండా జాగ్రత్త పడినప్పటికీ, 20 ఓవర్లలో భారత్ 9 వికెట్లకు 135 పరుగులు మాత్రమే చేయగలిగింది.

నాలుగు ఓవర్లు వేసిన క్రెమెర్, కేవలం 18 పరుగులిచ్చి మూడు వికెట్లు కూల్చాడు. భారత్‌ను దెబ్బతీసిన క్రెమెర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. అతనికే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా లభించింది.

English summary
India's quest to maintain a clean slate in their short cricket tour of Zimbabwe went up in smoke as they suffered a 10-run loss to the hosts in the second and final Twenty20 international here today.
మీ వ్యాఖ్య రాయండి