Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

అద్భుతంగా ఆడాం కానీ, నిరాశ పరిచింది: రహానే

Posted by:
Published: Tuesday, July 21, 2015, 13:25 [IST]

హరారే: జింబాబ్వే పర్యటనలో తమ ప్రదర్శన ఆకట్టుకుందని, అయితే చివరి మ్యాచులో ఓడిపోవడం నిరాశకు గురి చేసిందని భారత జట్టు సారథి అజింక్యా రహానే అన్నాడు. ఈ సిరీస్ ఆద్యంతం జట్టు ప్రదర్శన బాగుందని చెప్పాడు.

కుర్రాళ్లు బాగా ఆడారన్నాడు. బౌలింగులో, బ్యాటింగులో రాణించామని చెప్పాడు. అయితే, బ్యాటింగులో ఇంకా రాణించవలసి ఉండెనని అభిప్రాయపడ్డాడు. రెండో వన్డేలో లక్ష్యం తక్కువగానే ఉన్నప్పటికీ వరుసగా వికెట్లు కోల్పోయి ఓటమి చెందామని చెప్పాడు.

Disappointed with T20 loss but we did pretty well: Rahane

మూడు వన్డేలు, రెండు టి 20ల్లో భారత్ ఆశించిన మేర రాణించిందని చెప్పాడు. జింబాబ్వే పర్యటనలో రెండు రెండు సెంచరీలు చేయడంతో పాటు మురళీ విజయ్, తాను కలిసి హాఫ్ సెంచరీ చేయడం విజయంలో కీలక పాత్ర పోషించాయని చెప్పాడు. రెండో టీ ట్వంటీలో జింబాబ్వే అద్భుతంగా ఆడిందన్నాడు. కాగా, వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా, టీ ట్వంటీ సిరీస్‌ను మాత్రం సమం చేసింది.

English summary
Disappointed he might be with the stunning loss to Zimbabwe in the tour-ending second Twenty20 International but India's stand-in skipper Ajinkya Rahane insisted that his side performed "pretty well" during the short limited-overs cricket series.
మీ వ్యాఖ్య రాయండి