Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

భారత్‌లో ఐసిసి వరల్ట్ టి20, 2016: వేదికలివే

Posted by:
Published: Tuesday, July 21, 2015, 15:07 [IST]

ముంబై: ఐసీసీ వరల్డ్ టీ ట్వంటీ 20 2016 ఫైనల్‌కు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక కానుంది. టి 20 వేదికలను బిసిసిఐ మంగళవారం నాడు ప్రకటించింది. ప్రపంచ టి 20 2016లో మార్చి 11 నుంచి ఏప్రిల్ 3 వరకు జరగనున్నాయి.

కోల్‌కతాతో పాటు బెంగళూరు, చెన్నై, ధర్మశాల, మొహాలీ, ముంబై, నాగపూర్, న్యూఢిల్లీలు మ్యాచులకు వేదికలు కానున్నాయి. కోల్‌కతా పైనల్‌కు వేదిక కానుంది.

బిసిసిఐ సెక్రటరీ అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ఈ టోర్నమెంటుకు భారత్ వేదిక కావడం బిసిసిఐ గర్విస్తోందని చెప్పాడు. వేదికలను ప్రకటించినందున ప్రిపరేషన్ ప్రారంభిస్తామని చెప్పాడు. ఈ టోర్నమెంటు గుర్తుండిపోయేలా నిర్వహిస్తామన్నాడు. వరల్డ్ టి 20కి భారత్ తొలిసారి హోస్ట్‌గా ఉంది.

ICC World T20 2016 in India: Venues announced; Kolkata to host final

వరల్డ్ టీ 20 2016 వేదికలు (8)

బెంగళూరు (ఎం చిన్నస్వామి స్టేడియం)
చెన్నై (ఎంఏ చిదంబరం స్టేడియం)
న్యూఢిల్లీ (ఫిరోజ్ షా కోట్ల)
ధర్మశాల (హెచ్‌పిసిఏ స్టేడియం)
ముంబై (వాంఖేడే స్టేడియం)
కోల్‌కతా (ఈడెన్ గార్డెన్)
నాగపూర్ (విసిఏ స్టేడియం)
మొహాలీ (పిసిఏ స్టేడియం)

వేదికలు ప్రకటించారు. ఏ మ్యాచ్ ఎక్కడ జరుగుతుందో తెలియాల్సి ఉంది. అదే విధంగా టోర్నమెంటుకు మేనేజింగ్ కమిటీ....

బిసిసిఐ అధ్యక్షులు జగ్మోహన్ దాల్మియా, ఇతర మెంబర్లు చైర్మన్‌, సభ్యులుగా ఉంటారు.
అనురాగ్ ఠాకూర్ కన్వీనర్, సెక్రటరీ, బిసిసిఐ
అమితాబ్ చౌదరి, జాయింట్ సెక్రటరీ, బిసిసిఐ
అనిరుధ్ చౌదరి, ట్రెజరర్, బిసిసిఐ
జి గంగరాజు, వైస్ ప్రెసిడెంట్, బిసిసిఐ
రాజీవ్ శుక్లా, చైర్మన్, ఐపిఎల్
ఆశిష్ షెలార్, వైస్ ప్రెసిడెంట్, ముంబై క్రికెట్ అసోసియేషన్

English summary
Kolkata's iconic Eden Gardens stadium will host the final of the ICC World Twenty20 2016, the Board of Control for Cricket in India (BCCI) announced today while confirming all the venues for the prestigious tournament. World Twenty20 will be hosted by India from 11 March to 3 April, 2016.
మీ వ్యాఖ్య రాయండి