Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

ఫ్యాన్స్ రాళ్ల దాడి: క్షమాపణలు చెప్పిన లంక బోర్డు

Posted by:
Updated: Tuesday, July 21, 2015, 16:45 [IST]

కొలంబో: శ్రీలంక క్రికెట్ అభిమానులు చేసిన పనికి ఆ దేశ క్రికెట్ బోర్డు పాకిస్ధాన్ క్రికెటర్లకు క్షమాపణలు చెప్పింది. ప్రస్తుతం శ్రీలంకలో పర్యటిస్తున్న పాకిస్ధాన్ క్రికెటర్లు లంకను చీల్చి చెండాడిని వైనాన్ని ఆ దేశ అభిమానులు జీర్ణించుకోలేకపోయారు.

పాకిస్ధాన్ క్రికెటర్లపై రాళ్లతో విరుచుకుపడ్డారు. ఈ సంఘటన కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో చోటు చేసుకుంది. భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో శ్రీలంక 158/7తో ఉన్న దశలో సంఘటన జరిగింది. శ్రీలంక ఓటమిని చవిచూస్తుండటంతో జీర్ణించుకోలేని ఓ ప్రేక్షకుడు విసిరిన రాయి మైదానంలో పడింది. రిఫరీ శ్రీనాథ్‌ ఆటను అరగంట పాటు సస్పెండ్‌ చేశాడు.

sri lanka cricket board sorry to pakistani cricketers

భద్రతా సిబ్బంది పరుగు పరుగున మైదానంలోకి వచ్చి ఆటగాళ్లకు రక్షణగా నిలిచారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చాక మ్యాచ్‌ తిరిగి ప్రారంభమైంది. మ్యాచ్ ఆగిన సమయంలో ఆటగాళ్లను డ్రెస్సింగ్ రూంలోకి పంపించారు.

ఈ సంఘటనపై శ్రీలంక క్రికెట్ బోర్డు విచారం వ్యక్తం చేసింది. పాకిస్ధాన్ క్రికెటర్లకు క్షమాపణలు చెప్పింది. కాగా, శ్రీలంక పర్యటనలో పాకిస్థాన్‌ జోరు ఆదివారం కొనసాగింది. ఆదివారం మూడో వన్డేలో పాక్‌ 135 పరుగుల భారీ తేడాతో ఆతిథ్య లంకను చిత్తు చేసింది. ఈ విజయంతో ఐదు వన్డేల సిరీస్‌లో పాక్‌ 2-1 ఆధిక్యం సాధించింది.

Story first published:  Tuesday, July 21, 2015, 13:16 [IST]
English summary
sri lanka cricket board sorry to pakistani cricketers.
మీ వ్యాఖ్య రాయండి