Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

ముస్తాఫిజుర్ మాయాజాలం, సౌతాఫ్రికాకు బంగ్లా షాక్

Posted by:
Published: Wednesday, July 22, 2015, 15:14 [IST]

చిట్టాగాంగ్: వన్డే సిరీస్ నెగ్గి జోరుమీదున్న బంగ్లాదేశ్ టెస్టుల్లోను దక్షిణాఫ్రికాకు మరో షాక్ ఇచ్చేలా కనిపిస్తోంది. రెండు మ్యాచుల సిరీస్‌లో భాగంగా మంగళవారం మొదలైన తొలి టెస్టులో ఆతిథ్య బంగ్లాదేశ్ వరల్డ్ నెంబర్ వన్ టెస్టు జట్టు దక్షిణాఫ్రికాను 248 పరుగులకే ఆలౌట్ చేసింది.

బంగ్లాదేశ్ యువ పేస్ సంచలనం ముస్తాఫిజుర్ రహమాన్ టెస్టుల్లోనూ ఘనబోణీ కొట్టాడు. భారత్‌పై వరుస మ్యాచుల్లో 6, 5 వికెట్ల పడగొట్టడం ద్వారా వన్డేల్లో సూపర్ బోణీ కొట్టిన ముస్తాఫిజుర్ తొలిటెస్టులో సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించాడు.

 Mustafizur Rahman stars as Bangladesh dismiss South Africa for 248

ఓపెనర్ వాన్ జిల్‌తో పాటు, ఆమ్లా, బౌమ, డుమనిల రూపంలో ముస్తాఫిజుర్ 4 కీలక వికెట్లు పడగొట్టారు. దీంతో దక్షిణాఫ్రికా తొలి టెస్టులో తొలిరోజు 248 పరుగులకే ఆలౌటైంది.

ఆమ్లా, డుమినిలను ముస్తాఫిజుర్ వరుస బంతుల్లో ఔట్ చేశాడు. బౌమ (54) అర్ధ సెంచరీ, ఏల్గర్ 47, డుప్లెసిస్ 48 పరుగులు చేశారు. మిగతా వారు విఫలమయ్యారు. తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన బంగ్లాదేశ్ ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 7 పరుగులు చేసింది.

English summary
Bangladesh cricket fans have something to cheer about as their Tigers side roar into action on the opening day of the first test against South Africa, bowling out the visitors for 248.
మీ వ్యాఖ్య రాయండి