Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

క్రికెట్ కంటే ఏదీ గొప్పది కాదు: సస్పెన్లపై లక్ష్మణ్

Published: Wednesday, July 22, 2015, 16:14 [IST]

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీలైన చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్‌ను రెండేళ్ల పాటు నిషేధించడం దురదృష్టకరమని, అయితే క్రికెట్ కంటే ఏదీ గొప్పదికాదని భారత మాజీ ఆటగాడు వివిఎస్ లక్ష్మణ్ అన్నాడు. ఈ వివాదం నుంచి బయటపడి క్రికెట్ ఆదరణ పొందుతుందని చెప్పాడు.

ఐయాన్స్‌(ఐఏఎన్ఎస్)కి ఇచ్చిన ఇంటర్వ్యూలో లక్ష్మణ్ మాట్లాడుతూ.. 'చెన్నై, రాజస్థాన్‌లపై వేటుపడటం బాధాకరం. ఐపిఎల్‌లో కొన్ని ప్రతికూల సంఘటనలు వెలుగు చూసినా.. ఎన్నో సానుకూలాంశాలున్నాయి. ఆట కంటే ఏదీ గొప్పదికాదు. క్రికెటే అంతిమ విజేత' అని చెప్పాడు.

దిగ్గజ క్రికెటర్లతో యువ క్రికెటర్లు డ్రెస్సింగ్ రూమ్ పంచుకునే అవకాశం వచ్చిందంటే దానికి ఐపిఎలే కారణమని చెప్పాడు. వర్ధమాన క్రికెటర్లకు ఐపీఎల్ ఓ వేదికలాంటిందని అన్నాడు. చెన్నై, రాజస్థాన్ జట్ల ఆటగాళ్ల భవితవ్యం గురించి ఇప్పుడే మాట్లాడటం తొందరపాటు అవుతుందని తెలిపాడు. బిసిసిఐ గ్రూప్ ఈ సమస్యకు పరిష్కారం సూచిస్తుందని లక్ష్మణ్ చెప్పాడు.

VVS Laxman speaks on suspensions of CSK and RR

సుప్రీం కోర్టు మాజీ చీఫ్ జస్టిస్ లోధా కమిటీ.. ఐపిఎల్ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసులో చెన్నై, రాజస్థాన్ జట్లను రెండేళ్ల పాటు నిషేధించిన సంగతి తెలిసిందే. అలాగే చెన్నై యజమాని శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మేయప్పన్, రాజస్థాన్ సహ యజమాని రాజ్ కుంద్రాలు క్రికెట్ కార్యకలాపాల్లో పాల్గొనకుండా జీవితంకాలం నిషేధించింది.

కాగా, లోధా కమిటీ తీర్పును అధ్యయనం చేసేందుకు బిసిసిఐ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, రాజీవ్ శుక్లా, అనురాగ్ ఠాకూర్, అనిరుధ్ చౌదరిలతో ఓ వర్కింగ్ గ్రూప్‌ని ఏర్పాటు చేసింది. ఇది ఇలా ఉండగా, టీమిండియాకు కోచ్ అవసరమని లక్ష్మణ్ అభిప్రాయడ్డాడు. రవిశాస్త్రి టీం డైరెక్టర్ పదవిని సమర్థవంతంగా నిర్వహిస్తున్నాని తెలిపాడు. విరాట్ కోహ్లీ తన సానుకూల దృక్పథంతో టెస్ట్ కెప్టెన్‌గా రాణిస్తాడని అన్నాడు.

English summary
Former India batsman V.V.S Laxman on Wednesday termed the suspension of two Indian Premier League (IPL) teams Chennai Super Kings (CSK) and Rajasthan Royals (RR) as unfortunate, but added nothing is bigger than cricket and the game will ultimately emerge victorious despite the controversy.
మీ వ్యాఖ్య రాయండి