Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

రెండు సార్లు పెళ్లి చేసుకోనున్న క్రికెటర్ దినేశ్ కార్తిక్

Posted by:
Published: Thursday, July 23, 2015, 10:04 [IST]

చెన్నై: చాలా కాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న ప్రముఖ క్రికెటర్ దినేశ్ కార్తిక్, స్క్వాష్ ప్లేయర్ దీపికా పల్లికల్‌ల పెళ్లి ముహూర్తం ఎట్టకేలకు ఖరారైంది. ఈ వివహానికి ఒ ప్రత్యేకత ఉంది. తొలుత క్రైస్తవ, ఆ తర్వాత హిందూ సంప్రదాయాల ప్రకారం చెన్నైలోని ఓ హోటల్‌లో వీరి వివాహం జరగనుంది.

‘వచ్చే నెల 18న తొలుత క్రైస్తవ సంప్రదాయంలో, 20న తెలుగు నాయుడు సంప్రదాయరీతిలో దీపిక-దినేష్‌ల వివాహం జరుగుతుంద'ని దీపిక తండ్రి సంజీవ్‌ చెప్పారు. ఇరు కుటుంబాలు వీరి పెళ్లికి ఏర్పాట్లన్నీ పూర్తి చేశాయి.

A Hindu-Christian wedding for Dinesh Karthik and Dipika Pallikal

దీపికా పల్లికల్ క్రిస్టియన్ కుటుంబానికి చెందినది కాగా, దినేశ్ కార్తీక్‌ పూర్వీకులు ఆంధ్రప్రదేశ్‌ నుంచి వెళ్లి చెన్నైలో స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందిన వాడు. దీంతో ఇరు కుటుంబాల కోరిక మేరకు రెండు మతాల సంప్రదాయాల ప్రకారం వీరి విహవాం జరగనుంది.

దీపికా పల్లికల్ క్రైస్తవ సంప్రదాయ పెళ్లిరోజు తెల్ల గౌను, హిందూ సంప్రదాయం ప్రకారం పసుపు చీరను ధరించనుందని తెలిసింది. వీరి వివాహానికి ముందు మెహందీ ఫంక్షన్‌ కూడా ఉంటుందని తెలిసింది.

English summary
The wedding dates have been finalised and the wedding preparations are currently on at squash ace Dipika Pallikal and cricketer Dinesh Karthik's homes. We hear that the couple will have a traditional Christian wedding as well as a Hindu-style wedding at a star hotel in Chennai.
మీ వ్యాఖ్య రాయండి