Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

3వ స్పిన్నర్ మిశ్రానే: రాయుడు, జడేజా మిస్

Posted by:
Updated: Thursday, July 23, 2015, 15:06 [IST]

ముంబై: వచ్చే నెలలో జరగనున్న శ్రీలంక పర్యటనకు బీసీసీఐ భారత్ జట్టును ఎంపిక చేసింది. లెగ్ స్ఫిన్నర్ అమిత్ మిశ్రాకు జట్టులో చోటు కల్పించారు. 15 మంది సభ్యులు కలిగిన జట్టుకు విరాట్ కోహ్లీ నేతృత్వం వహించనున్నాడు.

శ్రీలంక టూర్ కోసం జట్టును ఎంపిక చేసేందుకు గాను సందీప్‌ పాటిల్‌ నేతృత్వంలోని సీనియర్‌ సెలెక్షన్‌ కమిటీ గురువారం సమావేశమైంది. శ్రీలంకలో టీమిండియా మూడు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆగస్టు 12 నుంచి ప్రారంభం అవుతుంది.

గాయం కారణంగా బంగ్లాదేశ్‌ టూర్‌కు దూరమైన కర్ణాటక బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్‌కు తిరిగి జట్టులో స్ధానం కల్పించారు. లంక పిచ్‌లు స్పిన్‌కు అనుకూలించడంతో, మూడో స్పిన్నర్‌గా ఎవరికి అవకాశమిస్తుందనే దానిపైనే ఎక్కువగా చర్చసాగిన చివరకు అమిత్ మిశ్రావైపే సెలక్టర్లు మొగ్గు చూపారు.

శ్రీలంక పర్యటనలో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు బీసీసీఐ సెలక్టర్లు మొండి చేయి చూపించారు. ఇక ఇటీవలే ముగిసిన జింబాబ్వే పర్యనటలో భారత్ వన్డే సిరిస్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన తెలుగుతేజం అంబటి రాయుడకి కూడా చోటు దక్కలేదు.

శ్రీలంక పర్యటనకు భారత జట్టు:

విరాట్ కోహ్లీ (కెప్టెన్), మురళీ విజయ్, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, చెతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, రోహిత్ శర్మ, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), హర్భజన్ సింగ్, భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మ, అశ్విన్, అమిత్ మిశ్రా, ఉమేష్ యాదవ్, వరుణ్ ఆరోన్ .

Story first published:  Thursday, July 23, 2015, 12:05 [IST]
English summary
Leg-spinner Amit Mishra has been recalled to the Indian Test squad for the next month's Sri Lanka tour. The 15-man squad will be led by Virat Kohli. The selection committee, headed by Sandeep Patil, picked the squad on Thursday.
మీ వ్యాఖ్య రాయండి