Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

లంక టూర్‌కు జట్టు ఎంపిక నేడే: 3వ స్పిన్నర్ ఎవరు?

Posted by:
Published: Thursday, July 23, 2015, 10:17 [IST]

న్యూఢిల్లీ: జింబాబ్వే పర్యటన విజయవంతంగా ముగియడంతో వచ్చే నెలలో జరగనున్న శ్రీలంక టూర్‌పై బీసీసీఐ దృష్టి కేంద్రీకరించింది. లంక టూర్ కోసం జట్టును ఎంపిక చేసేందుకు గాను సందీప్‌ పాటిల్‌ నేతృత్వంలోని సీనియర్‌ సెలెక్షన్‌ కమిటీ గురువారం సమావేశం కానుంది.

శ్రీలంకతో ఆగస్టు 12 నుంచి ఆరంభమయ్యే మూడు టెస్టుల సిరిస్‌కు 15-16 మంది సభ్యుల బృందాన్ని ఎంపిక చేయాలని సెలక్టర్లు భావిస్తున్నారు. ఈ ఎంపికలో మూడో స్పిన్నర్‌గా ఎవరికి అవకాశమిస్తుందనే దానిపైనే ఎక్కువగా చర్చసాగుతోంది. ఇందు కారణం లంక పిచ్‌లు స్పిన్‌కు అనుకూలించడమే.

కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు ఖచ్చితంగా ఎంపికయ్యే ఆటగాళ్లు కనీసం 13 మంది ఉన్నారు. ఆరుగురు స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మెన్‌ మురళీ విజయ్‌, శిఖర్‌ ధావన్‌, విరాట్‌ కోహ్లి, అజింక్య రహానె, రోహిత్‌ శర్మ, పుజారాల ఎంపిక లాంఛనమేనని క్రికెట్ నిపుణులు భావిస్తున్నారు.

 Will the selectors pick a 3rd spinner in India Test squad for Sri Lanka?

బంగ్లాదేశ్‌ టూర్‌కు దూరమైన కర్ణాటక బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్‌ను ఏడో బ్యాట్స్‌మన్‌గా తీసుకునే అవకాశం ఉంది. ఇక కీపర్‌గా వృద్ధిమాన్‌ సాహా ఎంపిక ఖాయం. అలాగే నమన్‌ ఓఝా లేదా సంజూ శాంసన్‌ను రిజర్వ్‌ కీపర్‌గా ఎంపిక చేసే అవకాశం ఉంది. ఇక పేస్‌ బౌలింగ్‌ కోటాలో భువనేశ్వర్‌ కుమార్, ఉమేష్‌ యాదవ్‌, ఇషాంత్‌ శర్మ, వరుణ్‌ ఆరోన్‌ తదితర పేర్లను పరిశీలిస్తున్నారు.

శ్రీలంక టూర్‌లో స్పిన్నర్ల ఎంపికే సెలక్టర్లకు పరీక్షగా మారింది. ఈ సిరీస్‌కు ముగ్గురు స్పిన్నర్లను పంపించాలని బోర్డు భావిస్తోంది. సీనియర్ ఆఫ్ స్పిన్నర్లు అశ్విన్, హర్భజన్‌ సింగ్‌ ఎంపిక ఖాయం. అయితే మూడో స్పిన్నర్‌ కోటాలో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌, అమిత్‌ మిశ్రా మధ్య తీవ్ర పోటీ నెలకొంది.

మూడో స్పిన్నర్‌ ఎంపికతో పాటు జట్టు సభ్యుల సంఖ్య పదిహేనా లేదా పదహారా అన్నది ఆసక్తి కూడా సగటు క్రికెట్ ప్రేమికుడికి కలిగిస్తోంది. లంక టూర్‌‌లో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు చోటు దక్కడం కష్టంగా కనిపిస్తోంది.

English summary
The third specialist spinner's slot will be the subject of much deliberation when the national selection committee, headed by Sandeep Patil, meets here tomorrow (July 23) to announce the squad for the three-Test away series against Sri Lanka starting August 12.
మీ వ్యాఖ్య రాయండి