Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

అక్షర్ టెస్టులకు పనికి రాడు: సన్నీ, ధోనీపై సందీప్

Published: Friday, July 24, 2015, 14:48 [IST]

న్యూఢిల్లీ: యువ స్పిన్నర్ అక్షర్ పటేల్ టెస్ట్ స్థాయి బౌలర్ కాదని టీమిండియా మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ అన్నాడు. అక్షర్ బౌలింగ్‌లో కొత్తదనం లేదని అభిప్రాయపడ్డాడు. అక్షర్ వేసే బంతుల్ని బ్యాట్స్‌మెన్లు తొందరగా పసిగట్టగలరని చెప్పాడు.

‘అక్షర్ బౌలింగ్‌లో ఫ్లయిట్ లేడు. కొత్తదనం లేదు. ఎవరైనా ఆ బంతుల్ని పసిగట్టగలరు. పిచ్ సహకరిస్తే తప్ప బంతిని ఎక్కువగా తిప్పలేడు. కొన్నేళ్లుగా నాణ్యమైన స్పిన్నర్లను వెతకడంలో విఫలమయ్యాం. రంజీ మ్యాచుల్లో పిచ్‌లపై ఎక్కువ గడిని వదలడం వల్ల నాణ్యమైన స్పిన్నర్లు బయటకి రావట్లేదు' అని సన్నీ వ్యాఖ్యానించాడు.

మరోవైపు ఐపిఎల్‌లో రాణించిన సర్పరాజ్ ఖాన్‌తో గవాస్కర్‌కు ప్రొఫెషనల్ మేనేజ్‌మెంట్ గ్రూప్(పిఎంజి) ఒప్పందం కుదుర్చుకుంది. మూడేళ్లపాటు సర్ఫరాజ్ క్రికెట్ వ్యవహారాలను పిఎంజి చూస్తుంది.

 Axar Patel not usefull for tests, says Sunil Gavaskar

బౌలర్లపై విమర్శించే హక్కు ధోనీకి ఉంది: సందీప్

అందుబాటుల్లో ఉన్న వనరుల్లో అత్యుత్తమ పేసర్లనే ఎంపిక చేశామని సెలక్షన్ కమిటీ ఛైర్మన్ సందీప్ పాటిల్ అన్నాడు. బంతిని వేగంగా విసిరే పేసర్లు కావాలా? లేక తెలివిగా బౌలింగ్ చేసే వాళ్లు కావాలా? అన్నది తేల్చుకోవాల్సిన అవసరముందని టీమిండియా కెప్టెన్ ఎంఎస్ ధోనీ బంగ్లాదేశ్ సిరీస్ తర్వాత విమర్శించిన సంగతి తెలిసిందే.

కాగా, శ్రీలంకతో సిరీస్‌కు పేసర్లను ఎందుకు మార్చలేదని మీడియా ప్రశ్నించగా.. ధోనీ వ్యాఖ్యలపై తాను మాట్లాడనని సందీప్ చెప్పాడు. తాము ఎప్పుడూ సమతుల జట్టు ఎంపికపైనే దృష్టిపెడతామని, శ్రీలంక పరిస్థితుల నేపథ్యంలో అత్యుత్తమ పేసర్లనే ఎంపిక చేశామని చెప్పారు.

ధోనీ విమర్శలు సెలక్టర్లను బాధించాయా? అని ప్రశ్నించగా.. ‘కెప్టెన్ విమర్శిస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ధోనీ అత్యుత్త నాయకుడు. బౌలర్లపై విమర్శలు చేసే హక్కు అతడికి ఉంది. అతడి విమర్శలకు స్పందించాల్సింది మేము కాదు బోర్డు' అని సందీప్ వివరించారు.

English summary
Team India former player Sunil Gavaskar said that Axar Patel not usefull for tests.
మీ వ్యాఖ్య రాయండి