Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

ఐపీఎల్‌ను నిషేధించండి: ప్రధాని మోడీకి గుత్తా లేఖ

Posted by:
Published: Friday, July 24, 2015, 11:05 [IST]

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను నిషేధించాలని కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రధాని మోడీని కోరారు. భారత్‌లో క్రికెట్‌ కార్యకలాపాలను నిర్వహిస్తోన్న బీసీసీఐ పారదర్శకంగా వ్వవహరించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ గుత్తా ప్రధానికి లేఖ రాశారు.

రాజకీయ నాయకులకు బీసీసీఐ కమిటీలో చోటు కల్పించకుండా ఉంటే బాగుంటుందని లేఖలో సూచించారు. కార్పోరేట్లు, రాజకీయ నాయకులు బీసీసీఐ బోర్డు వ్వవహారాల్లో తలదూర్చడం వల్ల క్రీడా స్ఫూర్తి దెబ్బతింటుందని పేర్కొన్నారు.

Gutta Sukhender reddy letter to prime minister modi regarding ipl

‘స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన బీసీసీఐ కొందరి చేతుల్లోనే ఉంది. ఇది ఎంత మాత్రం మంచిది కాదు. భారత క్రికెట్‌‌కు అనుబంధంగా బీసీసీఐ ఏర్పడింది. కమిటీలో కార్పొరేట్లు, రాజకీయ నాయకులే ఉన్నారు. వీరిని రాష్ట్ర స్థాయి క్రికెట్‌ అసోసియేషన్లు ఎన్నుకుంటున్నాయి. దీంతో అంతర్గత ప్రజాస్వామ్యం లేకుండా పోయింద'ని గుత్తా ఆందోళన వ్యక్తం చేశారు.

బీసీసీఐలో వివాదాల గురించి తాను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదని, బ్రాడ్ కాస్టింగ్ ద్వారా వచ్చే డబ్బు, ఇతర ఖర్చుల వ్వవహారం తీవ్ర అవినీతి మయమైందని తన లేఖలో గుత్తా సుఖేందర్‌ వెల్లడించారు.

English summary
Gutta Sukhender reddy letter to prime minister modi regarding ipl.
మీ వ్యాఖ్య రాయండి