Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

ధోనీ చేతికి చెన్నై సూపర్ కింగ్స్?

Posted by:
Published: Friday, July 24, 2015, 15:14 [IST]

న్యూఢిల్లీ: ఐపిఎల్ జట్లు చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ పైన జస్టిస్ లోథా కమిటీ రెండేళ్లు సస్పెన్షన్ విధించిన విషయం తెలిసిందే. ఇది ధోనీకి వరంగా మారిందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. సస్పెన్షన్‌కు గురైన చెన్నై సూపర్కింగ్స్‌ను ధోనీ చేజిక్కుంచుకోనున్నాడని వార్తలు వస్తున్నాయి.

లోథా తీర్పును అధ్యనయం చేసేందుకు బిసిసిఐ ఓ వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేసింది. ఏ నిర్ణయమైనా ఐపిఎల్ పాలక మండలి చేతుల్లోనే ఉంది. 2008 నుంచి ధోనీ చెన్నై జట్టుతోనే ఉన్నాడు. కానీ ఈ టీం పైన సస్పెన్షన్ విధించడంతో ప్లేయర్ల పరిస్థితి గందరగోళంగా మారింది.

MS Dhoni Might Own Chennai Super Kings: Report

ఆటగాళ్లను వేరే జట్లలో సర్దుబాటు చేస్తారా లేక మళ్లీ వేలంలో ఉంచుతారా స్పష్టం కావాల్సి ఉంది. అయితే, లోథా మాత్రం యాజమాన్యాలను బదలాయిస్తే ఈ జట్టు ఏపీఎల్లో కొనసాగవచ్చని చెప్పారు.

ఈ పాయింటుతో చెన్నై టీంను ధోనీ సొంతం చేసుకోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు, ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ ఈ జట్టుకు బదులు రాంఛీ ఫ్రాంచైజీని సొంతం చేసుకోవచ్చుననే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.

English summary
Indian skipper MS Dhoni might take over the suspended Chennai Super Kings (CSK) franchise soon, according to latest reports.
మీ వ్యాఖ్య రాయండి