Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

రవీంద్ర జడేజా భక్తిబాట: 350కి.మీ పాదయాత్ర

Published: Friday, July 24, 2015, 14:37 [IST]

రాజ్‌కోట్: భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ప్రస్తుతం భక్తి బాటలో నడుస్తున్నాడు. ఇప్పటికే టెస్ట్ జట్టులో స్థానం కోల్పోయిన జడేజా.. ఇటీవల జింబాబ్వే పర్యటనకు వెళ్లిన వన్డే జట్టులోనూ చోటు దక్కించుకోలేదు. ఈ నేపథ్యంలో దొరికిన సమయాన్ని రవీంద్ర జడేజా సద్వినియోగం చేసుకుంటున్నాడు.

జడేజా జులై 18న జామ్‌నగర్ నుంచి ప్రాచీన యాత్రా స్థలం మంతనో మధ్‌కు పాదయాత్ర ప్రారంభించాడు. జడేజా 350 కిలోమీటర్లు కాలినడకన వెళ్లి అక్కడ కొలువై ఉన్న రాజ్‌పుత్‌ల కుల దైవం ఆశాపురాను దర్శించుకుంటాడు.

Ravindra Jadeja visits mantano madh

జాడేజాతో పాటు అతడి తండ్రి, స్నేహితులు యాత్ర వెళ్తున్నారు. ‘అతడు(జడేజా) గతంలో అనేకసార్లు మంతనో మధ్‌ను దర్శించుకున్నాడు. కాలినడకను బయల్దేరడం మాత్రం ఇదే తొలిసారి' అని జడేజా సోదరి నైనా జడేజా తెలిపింది.

భారత క్రికెటర్ అయ్యాక పాదయాత్రకు వెళ్లాలని తన సోదరుడు జడేజా అనుకున్నాడని, కానీ అది ఇప్పటికిగానీ సాధ్యం కాలేదని నైనా జడేజా చెప్పింది.

English summary
All rounder Ravindra Jadeja visited Mantano Madh on foot.
మీ వ్యాఖ్య రాయండి