Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

స్పాట్ ఫిక్సింగ్: శ్రీశాంత్‌తో పాటు 16 మందికి ఊరట

Posted by:
Updated: Saturday, July 25, 2015, 17:14 [IST]

న్యూఢిల్లీ: ఐపీఎల్ స్టాప్ ఫిక్సింగ్ కేసులో దోషులకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. స్పాట్ ఫిక్సింగ్ కేసులో రాజస్దాన్ రాయల్స్ ఆటగాడు శ్రీశాంత్‌తో పాటు అజిత్ చండీలా, అంకత్ చవాన్‌, ఛండిల్లాకు విముక్తి లభించింది. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఢిల్లీ పోలీసులు దోషులుగా నిలబెట్టిన 16 మంది నిర్దోషులుగా పేర్కొంటూ ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించింది.

ఆటగాళ్లపై నమోదు చేసిన అభియోగాలన్నింటినీ కొట్టేస్తూ ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించింది. రెండేళ్ల క్రితం ఐపీఎల్‌ను కుదిపేసిన స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఢిల్లీ పోలీసులు శ్రీశాంత్, చండీలా, చవాన్‌లను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Sreesanth

ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఈ ఆటగాళ్లకు బుకీలతో సంబంధాలున్నాయని అభియోగాలు నమోదు చేశారు.  వీరితో పాటు రాజస్థాన్ క్రికెటర్లు అమిత్ సింగ్, సిద్ధార్థ్ త్రివేది, హర్మీత్ సింగ్ తదితరులను నిందితులుగా చేర్చారు.

స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారని కేసు నమోదు చేసిన పోలీసులు, ఆరోపణలను రుజువు చేయలేకపోయారంటూ ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో స్పాట్ ఫిక్సింగ్ తీర్పుపై 16 మంది క్రికెటర్లు హర్షం వ్యక్తం చేశారు.

Story first published:  Saturday, July 25, 2015, 17:11 [IST]
English summary
Rajasthan Royals' cricketers S Sreesanth, Ankeet Chavan and Ajit Chandila, who were accused of spot-fixing in the Indian Premier League (IPL) were all acquitted by the Delhi High Court here on Saturday.
మీ వ్యాఖ్య రాయండి