Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

రె'ఢీ': డ్యాన్స్ చేసి.. సానియా భర్తకు యువీ సవాల్

Posted by:
Published: Monday, July 27, 2015, 14:56 [IST]

ముంబై: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా భర్త, పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌కు భారత్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ కౌంటర్ ఇచ్చారు. జిమ్‌లో మైకెల్ జాక్సన్ గీతం... యు రాక్ మై వరల్డ్‌కు యువీ స్టెప్పులేశాడు.

తాను వేసిన సింపుల్ డ్యాన్స్ వీడియోను ఫేస్‌బుక్‌లో పెట్టారు. ఇదిగా ఇలా చేయాలి అంటూ షోయబ్ మాలిక్‌కు చురక అంటించారు. ఇదిగో ఇలా డ్యాన్స్ చేయాలి, షోయబ్ మాలిక్ భాయ్.. నేను మైదానంలోనే ఉన్నా అంటూ ప్రతి సవాల్ చేశారు.

This is how it is done! Shoaib Malik Bhai hum tho hamesha maidan mein the #Velfieapp

Posted by Yuvraj Singh on Sunday, July 26, 2015

పాకిస్తాన్ క్రికెట్ జట్టుతో కలిసి భారత టెన్నిస్ తార సానియా మీర్జా డ్యాన్స్ చేసిన అంశంపై భారత క్రికెట్ స్టార్ యువరాజ్ సింగ్ తనదైన శైలిలో కొద్ది రోజుల క్రితం స్పందించిన విషయం తెలిసిందే. దానికి సానియా భర్త షోయబ్ మాలిక్ ప్రతిగా రీట్వీట్ చేశాడు.

 Yuvraj Singh 'Moonwalks' in lesson for Shoaib Malik, Sania Mirza

సానియా, షోయబ్ డ్యాన్స్ ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. దీని పైన యువరాజ్ సింగ్ ట్వీట్ చేశాడు. వీరిద్దరు ఔట్ స్టాండింగ్ ఆటగాళ్లని, కానీ డ్యాన్స్ మాత్రం బాగా లేదని చెప్పాడు. యువీ ట్వీట్ పైన షోయబ్ మాలిక్ స్పందిస్తూ... మైదానంలో చూసుకుందాం రా అని రీట్వీట్ చేశాడు. దానిపై యువీ మళ్లీ కౌంటర్ ఇచ్చారు.

కాగా, పాకిస్ధాన్ క్రికెట్ జట్టు సభ్యులతో కలిసి భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా డ్యాన్స్ చేసింది. ఇటీవల శ్రీలంకతో ఆ దేశ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్ధాన్ జట్టు విజయం సాధించింది. దీంతో మ్యాచ్‌ను చూసేందుకు వెళ్లిన సానియా మీర్జా సంతోషంతో తన భర్తతో కలిసి విజయాన్ని సెలెబ్రేట్‌ చేసుకుంది.

భర్త షోయబ్‌ మాలిక్‌తోపాటు పాక్‌ ఆటగాళ్లతో కలిసి ‘అభీ తో పార్టీ షురూ హుయీ హై (పార్టీ ఇప్పుడే మొదలైంది)' అనే బాలీవుడ్‌ పాటకు ''డబ్ స్మాష్' డ్యాన్స్‌ చేసి తన ఆనందాన్ని పంచుకుంది. ఈ వీడియోను షోయబ్ మాలిక్ తన ట్విట్టర్ అకౌంట్‌లో ట్వీట్ చేశాడు.

English summary
Accepting Shoaib Malik’s challenge, India cricketer Yuvraj Singh on Saturday posted a Dubsmash video of his where he tried to emulate Michael Jackson’s ‘moon walk.’
మీ వ్యాఖ్య రాయండి