Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

బ్రెయిన్ ట్యూమర్‌తో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ మృతి

Posted by:
Updated: Tuesday, July 28, 2015, 19:19 [IST]

న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా మాజీ క్రికెట్ కెప్టెన్ క్లైవ్ రైస్ మంగళవారం (జులై 28)న ఉదయం కన్నుమూశారు. 66 ఏళ్ల రైస్‌కు బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి ఉంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించినట్లు క్రికెట్ సౌతాఫ్రికా వెబ్‌సైట్ పేర్కొంది.

ఈ ఏడాది మార్చిలో క్లైవ్ రైస్ సైబర్ నైప్ రోబొటిక్ రేడియో సర్జరీ కోసం బెంగుళూరులోని ఓ ఆసుపత్రికి వచ్చారు. సర్జరీ అనంతరం 'ది హిందూ' తో మాట్లాడుతూ తన ట్రీట్‌మెంట్ కోసం బీఎండబ్ల్యు కారుని అమ్మి భారత్‌కు వచ్చినట్టు పేర్కొన్నారు.

Former South Africa captain Clive Rice dies

'ఇక్కడి డాక్టర్లు చాలా నైపుణ్యం కలవారు. గంట సమయంలో నాకు మూడు ట్రీట్‌మెంట్స్ చేశారు' అని అన్నారు. 42 ఏళ్ల వయసులో రైస్ దక్షిణాఫ్రికా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహారించారు. రైస్ కెప్టెన్సీలో దక్షిణాఫ్రికా 1991లో భారత్‌లో పర్యటించింది.

దక్షిణాఫ్రికా తరుపున 3 అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లను రైస్ ఆడారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌‍లో 482 మ్యాచ్‌లాడిన రైస్ 25,000 పరుగులు సాధించి, 930 వికెట్లను తీసుకున్నాడు. క్లైవ్ రైస్ మృతి పట్ల దక్షిణాఫ్రికా క్రికెటర్లు, ఆయన అభిమానులు ట్విట్టర్‌లో సంతాపం తెలిపారు.

Story first published:  Tuesday, July 28, 2015, 14:33 [IST]
English summary
Former South Africa cricket captain Clive Rice passed away on Tuesday morning (July 28) at a hospital, local media reported.
మీ వ్యాఖ్య రాయండి