Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

పాక్‌తో క్రికెట్: బీసీసీఐ నిర్ణయాన్ని సమర్ధించిన దాదా

Posted by:
Updated: Tuesday, July 28, 2015, 19:09 [IST]

న్యూఢిల్లీ: భారత్, పాకిస్ధాన్‌ల మధ్య నెలకొన్న పరిస్ధితుల దృష్ట్యా ఈ ఏడాది చివరిలో జరగనున్న సిరిస్ కష్టమేనని బీసీసీఐ వర్గాలు సందేహాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ కూడా బీసీసీఐ నిర్ణయాన్నే సమర్ధించాడు.

సరిహద్దు ఉగ్రవాదానికి అడ్డుకట్ట వేసేదాకా పాక్ బోర్డుతో సంబంధాల పునరుద్ధరణ ఉండదని పేర్కొన్న బీసీసీఐతో తాను ఏకీభవిస్తున్నట్టు సౌరభ్ గంగూలీ తెలిపారు. ఇరు దేశాల బోర్డులు కూడా ఎనిమదేళ్ల పాటు అంటే 2023 వరకు ఐదు ద్వైపాక్షిక సిరిస్‌లను నిర్వహించేలా ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా ఈ ఏడాది డిసెంబర్‌లో ఇరు దేశాల మధ్య తొలి సిరిస్ నిర్వహించాల్సి ఉంది. అయితే సోమవారం పంజాబ్‌లోని గురుదాస్ పూర్‌లో ఉగ్రవాదులు చొరబడి బీభత్సం సృష్టించడం తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం బీసీసీఐ సెక్రటరీ అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ ఈ పరిస్ధితుల్లో భారత్, పాక్‌ల మధ్య క్రికెట్ సిరిస్ నిర్వహణ సాధ్యం కాదని బీసీసీఐ సెక్రటరీ అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు.

Ganguly backs BCCI: No cricket series with Pakistan amid terror strikes

1993 ముంబై వరుస పేలుళ్ల అనంతరం భారత్, పాక్‌ల మధ్య క్రికెట్ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ టోర్నమెంట్‌ల్లో తప్ప ద్వైపాక్షిక సిరిస్‌లు మాత్రం జరగలేదు. అయితే ఇటీవల భారత్, పాక్ మధ్య క్రికెట్ సంబంధాల పునరుద్ధరణకు పీసీబీ బోర్డ్ ఛైర్మన్ భారత్‌కు వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఇరు దేశాల బోర్డులు తటస్ధ వేదికపై సిరిస్ ఆడేందుకు సుముఖత వ్యక్తం చేశాయి. దుబాయ్ వేదికగా భారత్, పాక్ క్రికెట్ సిరిస్‌ను ఈ ఏడాది చివరలో నిర్వహించాలని యోచించాయి. అయితే సోమవారం జరిగిన ఉగ్రదాడితో భారత్, పాక్ క్రికెట్ సంబంధాల పునరుద్ధరణ కష్టంగా మారింది.

Story first published:  Tuesday, July 28, 2015, 18:04 [IST]
English summary
Former India captain Sourav Ganguly today backed BCCI's stance of not resuming bilateral cricketing ties with Pakistan until the cross-border terrorism stops.
మీ వ్యాఖ్య రాయండి