Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

ఆస్ట్రేలియాకు షాక్: రెచ్చిపోయిన అండర్సన్

Posted by:
Published: Thursday, July 30, 2015, 13:14 [IST]

బర్మింగ్ హామ్: యాషెస్ సిరీస్ 2015 మూడో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 136 పరుగులకే కుప్పకూలింది. రెచ్చిపోయిన ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ కేవలం 47 పరుగులకే ఆరు వికెట్లు పడగొట్టాడు.

ఈ సిరీస్‌ మ్యాచ్‌కో మలుపు తిరుగుతోంది. తొలి టెస్టులో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా చిత్తుగా ఓడితే విజయోత్సాహంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ రెండో టెస్టులో చేతులెత్తేసింది. తాజాగా మూడో టెస్టులో ఆస్ట్రేలియా వెనుకబడింది.

Ashes 2015: James Anderson burst helps England take charge

ఎడ్జ్‌బాస్టన్‌లో బుధవారం మొదలైన మూడో టెస్టును ఆసిస్ పేలవంగా ఆరంభించింది. జేమ్స్‌ అండర్సన్‌ (6/47) ధాటికి బెంబేలెత్తిన ఆసీస్‌ కేవలం 36.4 ఓవర్లలోనే 136 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ 133/3తో ఉంది.

English summary
England bounced back from their Lord's humiliation to seize control of the third Ashes Test in an astonishingly one-sided first day at Edgbaston.
మీ వ్యాఖ్య రాయండి