Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

400 టెస్ట్ వికెట్ క్లబ్‌లో స్టెయిన్, 13వ ఆటగాడు

Posted by:
Published: Thursday, July 30, 2015, 14:48 [IST]

ఢాకా: దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ 400 వికెట్లు తీసిన ఆటగాళ్ల క్లబ్‌లో చేరాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో బంగ్లా బ్యాట్స్‌మెన్ తమీమ్ ఇక్బాల్ వికెట్ తీసి ఈ ఘనతను సాధించాడు. టెస్టుల్లో మొత్తంగా ఈ ఘనత సాధించిన 13వ బౌలర్ కాగా, దక్షిణాఫ్రికా జట్టు తరుపున ఈ ఘనతను సాధించిన రెండో బౌలర్ డేల్ స్టెయిన్.

గతంలో దక్షిణాఫ్రికా పేసర్ షాన్ పొల్లాక్ 421 వికెట్లు తీసి ఈ రికార్డుని నెలకొల్పాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. బంగ్లాదేశ్ 12 పరుగులు స్కోరు ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ 6 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌కు పంపడంతో ఈ ఘనతను సాధించాడు.

South Africa's Dale Steyn joins 400 Test wicket club

డేల్ స్టెయిన్ తన 80వ టెస్టు మ్యాచ్‌లో ఈ అరుదైన రికార్డుని సొంతం చేసుకున్నాడు. 400 వికెట్లు తీసిన ముగ్గురు ఆటగాళ్లు మాత్రమే ప్రస్తుతం టెస్టు క్రికెట్‌లో కొనసాగుతున్నారు. భారత్‌కు చెందిన హర్బజన్ సింగ్, ఇంగ్లాండ్‌కు చెందిన జేమ్స్ ఆండర్సన్‌లు ఈ ఫీట్‌ను సాధించి టెస్టు క్రికెట్‌లో కొనసాగుతున్నారు.

టెస్టు క్రికెట్‌లో 400 వికెట్లు తీసిన రెండో అటగాడిగా డేల్ స్టెయిన్ చరిత్ర సృష్టించాడు. అంతక ముందు రిచర్డ్ హ్యాడ్లీ ఈ ఘనతను సాధించాడు.

English summary
Dale Steyn became the second South African bowler to take 400 Test wickets after he dismissed Bangladesh opener Tamim Iqbal on the opening day of the second Test in Dhaka on Thursday.
మీ వ్యాఖ్య రాయండి