Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

షాక్: శ్రీలంక పర్యటనకు ప్రియురాళ్లు, భార్యలు వద్దు

Published: Friday, July 31, 2015, 15:49 [IST]

న్యూఢిల్లీ: శ్రీలంక పర్యటనలో భారత క్రికెటర్ల భార్యలు, ప్రియురాళ్లను అనుమతించడం లేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బిసిసిఐ) స్పష్టం చేసింది. క్రికెటర్లెవరూ తమ వెంబడి భార్యలు, ప్రియురాళ్లను తీసుకెళ్ళకూడదని బిసిసిఐ ఓ ప్రకటనలో తేల్చి చెప్పింది.

ఆగస్టు మొదటి వారం నుంచి సెప్టెంబరు 1 వరకు శ్రీలంకలో టీమిండియా పర్యటించనుంది. అక్కడ ఓ సన్నాహక మ్యాచ్‌తో పాటు 3 టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. వన్డే ప్రపంచ కప్ టోర్నీ సమయంలో కూడా ఆటగాళ్ళ భార్యలను అనుమతించని విషయం తెలిసిందే.

గత నెలలో బంగ్లాదేశ్ పర్యటనను ముగించిన విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టెస్ట్ జట్టు.. ఆగస్టు మొదటి వారంలో శ్రీలంకలో పర్యటించనుంది. 15మంది ఆటగాళ్లతో కూడిన బృందం శ్రీలంక పయనం కానుంది.

Can’t accompany wives and girlfriends on Sri Lanka tour

‘ప్రస్తుతం ఆటగాళ్లకు విరామం సమయం చాలా దొరికింది. ఈ సమయంలో ఆటగాళ్లందరూ తమ కుటుంబసభ్యులతో గడిపారు. అందువల్ల శ్రీలంక పర్యటనకు ఆటగాళ్ల భార్యలను, ప్రియురాళ్లను అనుమతించడం లేదు' అని బిసిసిఐ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.

అయితే బిసిసిఐ నిర్ణయం.. ప్రేమజంట విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలకు కొంత ఇబ్బంది కలిగించేదిగా ఉంది. విదేశీ పర్యటనల్లో విరాట్ కోహ్లీతోపాటు కనిపించే అనుష్క శర్మ.. ఈసారి కోహ్లీకి దూరంగా ఉండనుంది.

కాగా, ఇప్పటికే ప్రధాన కోచ్ లేని భారత జట్టు.. డైరెక్టర్ రవిశాస్త్రి కూడా లేకుండానే శ్రీలంక పర్యటించనుంది. ప్రస్తుతం రవిశాస్త్రి ఇంగ్లాండ్‌లో ఉన్నారు. ఆయన యాషెస్ సిరీస్ టీవీ విశ్లేషణల్లో పాల్గొంటున్నారు. అయితే గాలేలో ఆగస్టు 12న జరిగే తొలి టెస్ట్ అనంతరం రవిశాస్త్రి భారత జట్టును కలిసే అవకాశం ఉంది. కాగా, టీమిండియా ఆగస్టు 9న శ్రీలంకకు చేరుకోనుంది.

English summary
THE Board of Control for Cricket in India (BCCI) has decided to not allow the Indian cricketers to take their wives and girlfriends (WAGs) along for the Test tour to Sri Lanka next month.
మీ వ్యాఖ్య రాయండి