Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

బీకేసీలోకి బీసీసీఐ హెడ్ క్వార్టర్స్ తరలింపు..!

Posted by:
Published: Saturday, August 1, 2015, 16:01 [IST]

ముంబై: ముంబై వాంఖడె స్డేడియంలో ఉన్న బీసీసీఐ ప్రధాన కార్యాలయాన్ని తరలించేందుకు నిర్ణయించింది. ముంబై శివారు ప్రాంతం బాంద్రా కుర్లా కాంప్లెక్స్(బీకేసీ)లో ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు చెందిన గ్రౌండ్‌లోకి ప్రధాన కార్యాలయాన్ని తరలించనుంది.

బీకేసీలో తమ కార్యాలయం ఏర్పాటు చేసుకోవడానికి తగినంత స్ధలాన్ని చూపాలని బీసీసీఐ తాజాగా ముంబై క్రికెట్ అసోసియేషన్‌ను కోరింది. ఇటీవలే ముంబై సబ్ అర్బన్ ప్రాంతంలో కొత్త బిజినెస్ డిస్ట్రిక్‌గా బాంద్రా కుర్లా కాంప్లెక్స్ ప్రాంతం అవతరించింది.

దీనిపై ముంబై క్రికెట్ అసోసియేషన్ స్పందించింది. త్వరలో బీకేసీ కాంప్లెక్స్‌లో క్లబ్ హౌస్‌కు ఎదురుగా ఓ నిర్మాణం చేపట్టాలనుకుంటున్నామని, అందులోనే బీసీసీఐ కార్యాలయం కోసం స్థలం కేటాయించనున్నామని ముంబయి క్రికెట్ అసోసియేషన్‌కు చెందిన ఓ వ్యక్తి తెలిపారు.

BCCI wants to shift headquarters to MCA premises in BKC

ఛత్రపతి శివాజీ ఎయిర్ పోర్టుకు బాగా దగ్గరగా ఉండే బీకేసీకి తన కార్యాలయాన్ని తరలించాలని బీసీసీఐ కోరుకుంటోందని ఆ వ్యక్తి పేర్కొన్నారు. బీసీసీఐ కోసం తాము నిర్మించబోయే భవనంలోనే ఓ చిన్న మీడియా గ్యాలరీ, కొన్ని గదులు నిర్మిస్తామని పేర్కొన్నారు.

దీనిపై ఆగస్టు 2న నిర్వహించనున్న మేనేజింగ్ కమిటీ సమావేశంలో ముంబై క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్, మాజీ బీసీసీఐ చైర్మన్ శరద్ పవార్ ఓ నిర్ణయం తీసుకోనున్నారు. బీకేసీలో కొత్త నిర్మాణం పూర్తైన వెంటనే బీసీసీఐ తన కార్యాలయాన్ని తరలింపు ప్రక్రియ ముగిసిన వెంటనే, ప్రస్తుతం బీసీసీఐ ప్రధాన కార్యాలయం ఉన్న బిల్డింగ్‌ను ముంబై క్రికెట్ అసోసియేషన్ ఆక్రమించనుంది.

English summary
The BCCI wants its headquarters, currently based in Wankhede Stadium in South Mumbai, to be shifted to Mumbai Cricket Association (MCA)-owned ground in suburban Bandra Kurla Complex (BKC).
మీ వ్యాఖ్య రాయండి