Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

ఇండియా ‘ఎ’ జట్టుకు కెప్టెన్‌గా అంబటి రాయుడు

Published: Sunday, August 2, 2015, 15:21 [IST]

చెన్నై: భారత్‌-ఎ త్వరలోనే దక్షిణాఫ్రికా-ఎతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ ఆడనుంది. కేరళలోని వయానడ్‌లో ఆగస్టు 18న తొలి మ్యాచ్‌ జరుగుతుంది. ఇటీవలే ఆస్ట్రేలియా-ఎతో ఇండియా ఎ రెండు అనధికార టెస్టుల సిరీస్‌ను ముగించుకున్న విషయం తెలిసిందే. కాగా, దక్షిణాఫ్రికాతో జరిగే ఈ సిరీస్‌లో భారత జట్టుకు అంబటి రాయుడు నాయకత్వం వహిస్తాడు.

ఈ సిరీస్‌ కంటే ముందు ఆగస్టు 5 నుంచి భారత్‌, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా 'ఎ' జట్లు ముక్కోణపు వన్డే సిరీస్‌లో తలపడతాయి. ఈ సిరీస్‌కు భారత జట్టు కెప్టెన్‌గా ఢిల్లీ యువ బ్యాట్స్‌మన్‌ ఉన్ముక్త్‌ చంద్‌ ఎంపికయ్యాడు. ఫైనల్‌ 14న జరుగుతుంది.

Ambati Rayudu And Unmukt Chand to Lead India 'A' Squads for South Africa Series

ముక్కోణపు వన్డే సిరీస్‌ జట్టు: ఉన్ముక్త్‌ చంద్‌ (కెప్టెన్‌), మయాంక్‌ అగర్వాల్‌, మనీష్‌ పాండే, కరుణ్‌ నాయర్‌, కేదార్‌జాదవ్‌, సంజు శాంసన్‌, అక్షర్‌ పటేల్‌, పర్వేజ్‌ రసూల్‌, కర్ణ్‌ శర్మ, ధవల్‌ కులకర్ణి, సందీప్‌ శర్మ, రుష్‌ కలారియా, మన్‌దీప్‌ సింగ్‌, గుర్‌కీరత్‌ సింగ్‌, రిషి ధావన్‌.

దక్షిణాఫ్రికా-ఎతో సిరీస్‌కు జట్టు: అంబటి రాయుడు (కెప్టెన్‌), కరుణ్‌ నాయర్‌, అభినవ్‌ ముకుంద్‌, అంకుశ్‌ బైన్స్‌, శ్రేయస్‌ అయ్యర్‌, బాబా అపరాజిత్‌, విజయ్‌ శంకర్‌, జయంత్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌, కర్ణ్‌ శర్మ, అభిమన్యు మిథున్‌, శార్దూల్‌ ఠాకూర్‌, ఈశ్వర్‌ పాండే, షెల్డాన్‌ జాక్సన్‌, జీవన్‌జ్యోత్‌ సింగ్‌.

English summary
Unmukt Chand will lead India 'A' in the one-day tri-series involving Australia 'A' and South Africa 'A' while Ambati Rayudu was named skipper of the four-day Test team.
మీ వ్యాఖ్య రాయండి