Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

ఐనా, దూకుడు మార్చుకోను, ఇది ఛాలెంజ్: కోహ్లీ

Posted by:
Published: Sunday, August 2, 2015, 14:44 [IST]

చెన్నై: మ్యాచ్‌ల కోసం గ్రౌండ్లోకి దిగిన ప్రతిసారీ బాధ్యతగా ఆడుతున్నానని, సర్వశక్తులు ఒడ్డి, దేశానికి అత్యుత్తమ సేవలు అందించేందుకు కృషి చేస్తున్నానని భారత టెస్ట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. ఇటీవల కాలంలో నిలకడగా ఆడలేకపోతున్న కోహ్లీ ఆస్ట్రేలియా ఎతో జరిగిన అనధికార టెస్టులో భారత్ ఎ తరఫున తొలి ఇన్నింగ్స్‌లో 16, రెండో ఇన్నింగ్స్‌లో 45 చొప్పున పరుగులు చేశాడు.

దూకుడు స్వభావం ఉన్నందుకే అతను ఆటపై దృష్టి కేంద్రీకరించలేకపోతున్నాడని, ఫలితంగా భారీ స్కోర్లు సాధ్యం కావడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత అతను ఒక్క సెంచరీ కూడా నమోదు చేయలేకపోవడాన్ని వారు గుర్తుచేస్తున్నారు.

అయితే, విమర్శలను తాను పట్టించుకోనని ఓ ఇంటర్వ్యూలో కోహ్లీ చెప్పాడు. ఫీల్డింగ్ చేస్తున్నప్పుడుగానీ, బ్యాటింగ్ సమయంలోగానీ తన స్వభావాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదన్నాడు. దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్నంత కాలం అత్యుత్తమ సేవలు అందించేందుకే ప్రయత్నిస్తానన్నాడు.

First full tour will be a challenge, says Virat Kohli

ఫాం విషయంలో కొంచెం ఇబ్బంది పడుతున్నంత మాత్రాన తన శైలిని మార్చుకునే అవకాశం లేదన్నాడు.

ఇటీవల తాను రాణించలేకపోయిన నేపథ్యంలో శ్రీలంకతో టెస్టు సిరీస్‌ సందర్భంగా బ్యాటింగ్‌ శైలి మార్చుకుంటారా అని కోహ్లిని ప్రశ్నిస్తే.. బ్యాట్స్‌మన్‌గా ఈ శైలితోనూ బాధ్యతాయుతమైన ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాను. మ్యాచ్‌ గెలవాలన్న లక్ష్యంతోనే నేనెప్పుడూ ఆడతాను. జట్టు బాధ్యతను బోర్డు నాకప్పగించడానికి కూడా ఇదే ప్రధాన కారణమని నేను భావిస్తాను. కాబట్టి శైలి మార్చుకునే అవకాశమే లేదు. నేనెప్పుడూ వంద శాతం ప్రదర్శన చేయడానికే ప్రయత్నిస్తా. ఇక అదనపు ప్రయత్నం అంటూ ఏముంటుంది?'' అన్నాడు.

టెస్టు సారథిగా పూర్తి స్థాయి సిరీస్‌ ఆడబోతుండటంపై మాట్లాడుతూ పూర్తిస్థాయి సారథిగా ఆస్ట్రేలియాలో ఓ టెస్టు ఆడానని, బంగ్లాదేశ్‌తో కూడా ఒక్క టెస్ట్ మాత్రమే జరిగిందని, శ్రీలంకతో జరగబోయేది తన తొలి పూర్తి స్థాయి సిరీస్‌ అని చెప్పాడు.

జట్టు విషయంలో చాలా నమ్మకంగా ఉన్నానని చెప్పాడు. బోర్డు తనకు ఇచ్చిన బాధ్యతను నెరవేరుస్తానని చెప్పాడు. బ్యాటింగ్ లైనప్‌లో అజింక్యా రహానే కీ వ్యక్తి అని చెప్పాడు.

English summary
India Test skipper Virat Kohli talks about why he sees no reason to curb his aggressive instinct, what it means to lead the young team and why Rahane is a key member of the batting lineup.
మీ వ్యాఖ్య రాయండి