Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

సెహ్వాగ్ ఆటను చూసి నేర్చుకోండి: కోహ్లీకి ద్రావిడ్

Published: Monday, August 3, 2015, 16:40 [IST]

న్యూఢిల్లీ: 2008లో గాలేలో అజేయంగా 201 పరుగులు చేసిన డాషింగ్ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్ ఇన్నింగ్స్‌ను ఆదర్శంగా తీసుకుని ఆడేందుకు ప్రయత్నించాలని టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి టీమిండియా ఎ కోచ్ రాహుల్ ద్రావిడ్ సూచించాడు. ఈ ఇన్నింగ్స్‌ను దృష్టిలో పెట్టుకుని శ్రీలంక బౌలర్ అజంతా మెండీస్‌ బౌలింగ్‌లో ఎలా పరుగులు రాబట్టాలో నేర్చుకోవాలన్నాడు.

అజంతా మెండిస్‌కు బ్యాట్స్‌మెన్‌ను తన బంతులతో ఇబ్బంది పెట్టే సత్తా ఉందని తెలిపాడు. 2008లో టీమిండియాతో జరిగిన మ్యాచులో 6 వికెట్లను పడగొట్టాడని చెప్పాడు. సెహ్వాగ్ ఇన్నింగ్స్ శ్రీలంకలో ఆ దేశ బౌలర్లను సమర్థవంతంగా ఎలా ఎదుర్కొవాలో చెబుతుందని తెలిపాడు.

Kohli seeks inspiration from Sehwag's 201 at Galle

భారత బ్యాట్స్‌మెన్ అందరూ సెహ్వాగ్ ఆ ఇన్నింగ్స్‌ను చూడాలని, దాన్నుంచి నేర్చుకోవాలని చెప్పాడు. ఆ మ్యాచులో సెహ్వాగ్ 329 బంతులు ఎదుర్కొని 201 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కాగా, ఆ మ్యాచులో మిగితా ఆటగాళ్లు రెండెంకెల సంఖ్యల పరుగులు కూడా చేయలేకపోయారని చెప్పాడు.

టెస్ట్ క్రికెట్‌లో రాణించాలనుకునే యువ ఆటగాళ్ల సెహ్వాగ్ ఆడిన ఆ ఇన్నింగ్స్‌ను తప్పకుండా చూడాలని అన్నాడు. అజింక్యా రహానే, రోహిత్ శర్మ, మురళీ విజయ్‌లు మంచి షాట్లు ఆడుతుంటారని చెప్పాడు. కాగా, ఆగస్టు మొదటి వారంలో తొలిసారిగా విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టెస్ట్ జట్టు శ్రీలంక పర్యటనకు వెళుతోంది.

English summary
India A coach Rahul Dravid, who spent some quality time with Test captain Virat Kohli advised him to make Virender Sehwag's unbeaten 201 at Galle (in 2008) against a rampaging Ajantha Mendis as a reference frame for facing the Sri Lankan tweakers this time round.
మీ వ్యాఖ్య రాయండి