Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

‘వచ్చే ప్రపంచ కప్‌లో టీమిండియా తరపున ఆడతా’

Published: Tuesday, August 4, 2015, 17:53 [IST]

గురువాయూర్: భారత క్రికెట్ నియంత్రణ మండలి తనపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాడు స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొని ఇటీవలే ఢిల్లీ కోర్టు తీర్పుతో నిర్దోషిగా బయటపడ్డ భారత మాజీ పేసర్ శ్రీశాంత్. తాను 2019 ప్రపంచ కప్ టోర్నీలో టీమిండియా తరపున ఆడతాననే ధీమా వ్యక్తం చేస్తున్నాడు.

గురువాయూర్‌లోని ప్రఖ్యాతిగాంచిన శ్రీకృష్ణ ఆలయాన్ని మంగళవారం శ్రీశాంత్ సందర్శించాడు. 2013లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న తర్వాత ప్రజల్లోకి వచ్చింది ఇదే తొలిసారి కావడం గమనార్హం.

కోర్టు నిర్ధోషిగా తేల్చిన నేపథ్యంలో కేరళ క్రికెట్ అసోసియేషన్(కెసిఏ) కూడా శ్రీశాంత్‌పై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని బిసిసిఐని కోరింది. కాగా, బిసిసిఐ మాత్రం కోర్టు నిర్ధోషిగా తేల్చినా శ్రీశాంత్‌పై నిషేధం కొనసాగుతుందని తేల్చి చెప్పింది.

Confident of playing for India in 2019 World Cup, says banned Sreesanth

‘బిసిసిఐలో ఉన్న వారికి హృదయం ఉందని అనుకుంటున్నా. నిషేధం ఎత్తివేస్తూ బిసిసిఐ నిర్ణయం తీసుకునే వరకు వేచిచూస్తా. నేడో, రేపో నాపై విధించిన నిషేధం తొలగించబడుతుంది. 2019 ప్రపంచ కప్ టోర్నీకి వెళ్లే టీమిండియా జట్టులో స్థానం దక్కుతుందని ఆశిస్తున్నా. లేదా కనీసం కేరళ జట్టులోనైనా ఆడేందుకు అనుమతిస్తుందని ఆకాంక్షిస్తున్నా' అని శ్రీశాంత్ పేర్కొన్నాడు.

కాగా, కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ కూడా శ్రీశాంత్‌కు మద్దతు పలికారు. 32ఏళ్ల శ్రీశాంత్‌పై విధించిన నిషేధాన్ని బిసిసిఐ ఎత్తివేస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.

English summary
Though he is yet to get any positive response from the Board of Control for Cricket in India (BCCI) on lifting of the life ban imposed on him by the governing body for alleged fixing, former Indian speedster S Sreesanth expressed confidence of representing the country in the 2019 World Cup.
మీ వ్యాఖ్య రాయండి