Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

ఇంగ్లాండ్ బౌలర్ లీచ్ అరుదైన రికార్డ్: హ్యాట్రిక్ (వీడియో)

Posted by:
Published: Tuesday, August 4, 2015, 15:10 [IST]

లండన్: వర్సెస్టర్‌షైర్ ఫాస్ట్ బౌలర్ జో లీచ్ అరుదైన రికార్డును సాధించాడు. ఇంగ్లీష్ కౌంటీల్లో తాను ఆడిన మొదటి మ్యాచ్, మొదటి మూడు బంతుల్లో హ్యాట్రిక్ నమోదు చేశాడు. 24 ఏళ్ల లీచ్ వన్డే ఇంగ్లీష్ కౌంటీలో మొదటి మ్యాచ్‌ని నార్తాంప్టన్ షైర్‌తో ఆడాడు.

మొదటి బంతికి వికెట్ కీపర్ బెన్ కాక్స్ క్యాచ్ అందుకోగా రిచర్డ్ లెవీని పెవిలియన్‌కు పంపాడు. అతను వేసిన రెండో బంతి రాబ్ కియోగ్ బ్యాట్‌ను తాకి కాక్స్ గ్లోవ్స్‌లోకి చేరింది. వరుసగా రెండు బంతుల్లో రెండు వికెట్లు సాధించాడు.

ఆ తర్వాత అతను వేసిన మూడో బంతిని బెన్ డకెట్ షాట్ కొట్టేందుకు ప్రయత్నించి జాక్ షాంట్రీ క్యాచ్ పట్టుకోవడంతో వెనుదిగాడు. లీచ్‌కు తాను ఆడిన ఇంగ్లీష్ కౌంటీ వన్డే మొదటి మ్యాచ్, మొదటి ఓవర్‌లో, మొదటి మూడు బంతుల్లో మూడు వికెట్లు సాధించిన బౌలర్‌గా గుర్తింపు లభించింది.

2003లో శ్రీలంక పేసర్ చామిందా వాస్ కూడా తాను ఆడిన మొట్టమొదటి ప్రపంచ కప్ మ్యాచ్ మొదటి మూడు బంతుల్లో హ్యాట్రిక్ సాధించాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో అతను ఆ ఓవర్‌లో హ్యాట్రిక్ సహా నాలుగు వికెట్లు కూల్చాడు.

English summary
In an amazing feat, Worcestershire seamer Joe Leach claimed a hat-trick from the first 3 balls of a one-day English county match against Northamptonshire but his heroics went in vain.
మీ వ్యాఖ్య రాయండి