Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

పొరపాట్లు చేశా, కష్టపడుతున్నా: ఊతప్ప

Posted by:
Published: Wednesday, August 5, 2015, 15:33 [IST]

బెంగళూరు: తాను జింబాబ్వే పర్యటనలో కొన్ని తప్పులు చేశానని ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ రాబిన్ ఊతప్ప చెప్పాడు. తాను టీమిండియాలోకి వచ్చేందుకు హార్డ్ వర్క్ చేస్తున్నానని చెప్పాడు. జింబాబ్వే పర్యటనలో ఊతప్ప పెద్దగా రాణించలేదు.

ఈ పర్యటనలో మూడు వన్డేలు ఆడిన రాబిన్ ఊతప్ప ఫెయిల్ అయ్యాడు. అదే సమయంలో రెండు టీ ట్వంటీల్లో మాత్రం మాత్రం రాణించాడు.

జింబాబ్వే పర్యటనలో ఊతప్ప మూడు వన్డేల్లో వరుసగా... 0, 13, 31 పరుగులు చేశాడు. మొదటి రెండు వన్డేల్లో ఐదో నెంబర్లో వచ్చాడు. ఆఖరి వన్డేలో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. అయితే, అతను రాణించలేదు.

I made some 'wrong judgements' in Zimbabwe, says Robin Uthappa

రాబిన్ ఊతప్ప ఓపెనింగ్ స్పెషలిస్ట్. మిడిల్ ఆర్డర్‌లో రావడం తనకు కొత్త అని చెబుతున్నాడు. జింబాబ్వేతో ఆడిన టీ ట్వంటీల్లో మాత్రం అతను రాణించాడు. తొలి టి ట్వంటీలో 39 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్‌ను భారత్ 54 పరుగుల తేడాతో గెలిచింది. ఆ తర్వాత మ్యాచ్‌లో 42 పరుగులు చేశాడు.

జింబాబ్వే టూర్ గురించి ప్రశ్నించగా... టీ ట్వంటీల్లో తాను రాణించానని చెప్పాడు. అయితే, వన్డేల్లో తాను ఆకట్టుకోలేకపోయానని చెప్పాడు. తాను కొన్ని పొరపాట్లు చేశానని చెప్పాడు. భవిష్యత్తులో ఆడే మ్యాచుల్లో తప్పకుండా రాణిస్తానని నమ్మకం ఉందని చెప్పాడు.

English summary
Opening batsman Robin Uthappa feels he made some "wrong judgements" during the One Day Internationals against Zimbabwe and is currently working hard to make a comeback to the national team.
మీ వ్యాఖ్య రాయండి