Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

సంగక్కర, జయవర్దనేకు థాంక్స్ చెప్పిన కోహ్లీ

Posted by:
Published: Wednesday, August 5, 2015, 15:01 [IST]

కొలంబో: టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మంగళవారం (ఆగస్టు 4)న రాత్రి కొలంబోని 'మినిస్ట్రీ ఆఫ్ క్రాబ్'‌లో డిన్నర్ చేశాడు. అయితే ఇందులో ఏంటీ ప్రత్యేకత అని అనుకుంటున్నారా? శ్రీలంకకు చెందిన క్రికెటర్లు కుమార సంగక్కర, మహిలా జయవర్దనేలదే ఈ రెస్టారెంట్.

మూడు టెస్టు మ్యాచ్‌ల నేపథ్యంలో టీమిండియా శ్రీలంకకు చేరుకుంది. ఇందులో భాగంగా మంగళవారం రాత్రి ఈ రెస్టారెంట్‌ను విరాట్ కోహ్లీ సందర్శించాడు. అద్భుతమైన సీ పుడ్‌ను ఈ రెస్టారెంట్‌లో తిన్నానని, అందుకు సంగక్కర, జయవర్దనేలకు ట్విట్టర్‌లో కోహ్లీ ధన్యవాదాలు తెలిపాడు.

Kohli thanks Sangakkara and Jayawardene for 'smashing meal' at Ministry of Crab

ఇక మినిస్ట్రీ ఆఫ్ క్రాబ్‌ను 2012లో శ్రీలంక మాజీ కెప్టెన్లు కుమార సంగక్కర, జయవర్దనే సంయుక్తంగా ప్రారంభించారు. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా టీమిండియా, శ్రీలంకల మధ్య తొలిటెస్టు ఆగస్టు 12న గల్లెలో జరగనుంది.

English summary
India's Test captain Virat Kohli enjoyed a "smashing meal" last night (August 4) at Colombo's "Ministry of Crab" restaurant which is owned by Sri Lanka's legendary duo of Kumar Sangakkara and Mahela Jayawardene.
మీ వ్యాఖ్య రాయండి