Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

క్లారిటీ మిస్: కోచ్‌లు ఉన్నారా లేరా?(ఫోటోలు)

Posted by:
Published: Wednesday, August 5, 2015, 11:20 [IST]

కొలంబో: మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ కోసం టీమిండియా శ్రీలంకలో అడుగుపెట్టింది. ఈ టెస్టు సిరిస్ ముగిసిన అనంతరం మూడు టీ20లు, ఐదు వన్డేలు, నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ కోసం భారత్ పర్యటనకు రానుంది దక్షిణాఫ్రికా. అయితే ఇంత బిజీ షెడ్యూల్‌ ముందు ఉండగా, బీసీసీఐ మాత్రం టీమిండియా జట్టుకు కోచ్, సహాయ సిబ్బందిని నియమించక పోవడం విశేషం.

శ్రీలంక పర్యటనకు వెళ్లిన టీమిండియా జట్టు వెంట కోచ్‌ల బృందం ఉందా లేదా అనే అనుమానం కలుగుతోంది. డంకన్ ప్లెచర్ రాజీనామా అనంతరం ఇప్పటి వరకు టీమిండియాకు కోచ్‌ను ఎంపిక చేయలేదు. ప్రస్తుతం టీమిండియా డైరెక్టర్‌గా ఉన్న రవిశాస్త్రి కూడా యాషెస్ సిరీస్‌లో కామెంటేటర్‌గా బిజీగా ఉన్నాడు.

మరోవైపు జట్టుకు సహాయక సిబ్బంది అరుణ్ (బౌలింగ్ కోచ్), శ్రీధర్ (ఫీల్డింగ్ కోచ్), సంజయ్ బంగర్ (బ్యాటింగ్ కోచ్)లతో ఒప్పందాలు పొడిగింపు విషయంలోనూ స్పష్టత లేదు. శ్రీలంక పర్యనటలో భాగంగా సన్నాహక కార్యక్రమాల్లో పాలుపంచుకోని టీమిండియా డైరెక్టర్ రవిశాస్త్రి లంక ఎలెవన్ జట్టుతో జరిగే ప్రాక్టీస్ మ్యాచ్‌లోపు కూడా జట్టుతో చేరే అవకాశాలు కనిపించడం లేదు.

లంక పర్యనటలో కోచ్‌లు ఉన్నారా లేరా?

ఆగస్టు 12న జరగనున్న తొలి టెస్టుకు నాలుగు రోజుల ముందు అంటే ఆగస్టు 8న రవిశాస్త్రి జట్టుతో కలుస్తాడని సమాచారం. ఈ నేపథ్యంలో స్కై స్పోర్ట్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నందుకే రవిశాస్త్రి అందుబాటులో లేకుండాపోయాడని, అతనికి టీమిండియా డైరెక్టర్ బాధ్యతలపై ఆసక్తి లేదని ఆరోపణలు కూడా వస్తున్నాయి.

 

లంక పర్యనటలో కోచ్‌లు ఉన్నారా లేరా?


అయితే రవిశాస్త్రి అందుబాటులో లేకపోవడానికి కారణం శ్రీలంక పర్యటన షెడ్యూల్ అనుకున్న దానికంటే పదిరోజుల ముందే ప్రారంభం అవతుండటమేనని తెలుస్తోంది. ఇందులో భాగంగానే రవిశాస్త్రి జట్టుతో కలవలేకపోయాడని బీసీసీఐ చెప్తోంది.

లంక పర్యనటలో కోచ్‌లు ఉన్నారా లేరా?


ఏది ఏమైనప్పటికీ, టీమిండియాకు కోచ్, పూర్తి స్ధాయి సహాయక సిబ్బందిని నియమించే వరకూ ఇలాంటి సమస్యలు వస్తూనే ఉంటాయని క్రికెట్ నిపుణులు భావిస్తున్నారు.

లంక పర్యనటలో కోచ్‌లు ఉన్నారా లేరా?


టీమిండియాకు ప్రధాన కోచ్ ఎంపిక బాధ్యతలను బీసీసీఐ సహాయక కమిటీకి అప్పగించిన సంగతి తెలిసిందే

English summary
Virat Kohli-led India Test squad arrived in Colombo to a very warm welcome on Monday. The fifteen-member squad will play a warm-up game and three Tests on the tour.
మీ వ్యాఖ్య రాయండి