Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

భారత్‌తో ఆడితే నేర్చుకోవచ్చు:పాక్ జట్టుకి ఇంజమామ్

Posted by:
Published: Thursday, August 6, 2015, 15:34 [IST]

కరాచీ: భారత జట్టుతో ఆడితో ఒత్తిడిలోను ఎలా ఆడవచ్చో తెలుసుకోవచ్చునని పాకిస్తాన్ మాజీ సారథి ఇంజమామ్ ఉల్ హక్ అభిప్రాయపడ్డాడు. పాకిస్తాన్ జట్టును మరిన్ని ఎక్కువ పర్యటనలకు పంపించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డును ఆయన కోరారు.

పాక్ క్రికెటర్లు ఒత్తిడిలోనూ ఎలా రాణించాలో తెలుసుకోవాలంటే టీమిండియాతో ఆడుతుండాలన్నాడు. బాగా రాటుదేలాలంటే జాతీయ జట్టును భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా పర్యటనలకు వీలైనంత ఎక్కువగా పంపిస్తుండాలన్నాడు.

Inzamam ul Haq

గతంలో తాము ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా దేశాల్లో పర్యటించినప్పుడు కష్టాల పాలయ్యామని, అదే సమయంలో, ఒత్తిడి సమయాల్లో ఎలా ఆడాలో కొంత నేర్చుకున్నామని చెప్పాడు. ఇప్పుడు భారత జట్టుతో ఆడడం ద్వారా ఒత్తిడిని ఎలా జయించాలో నేర్చుకోవచ్చన్నాడు.

పాకిస్తాన్ ఆటగాళ్లకు ఇంతకంటే మంచి మార్గం ఉంటుందని తాను అనుకోవడం లేదన్నాడు. ఎక్కడ ఆడామన్నది ముఖ్యం కాదని, భారత్‌తో క్రమం తప్పకుండా ఆడుతుండాలన్నాడు. ఈ దిశగా పీసీబీ మరిన్ని పర్యటనలు ఏర్పాటు చేయాలన్నాడు.

English summary
Former batting great Inzamam-ul-Haq says if Pakistani cricketers have to learn performing under pressure, they must play arch-rivals India on regular basis.
మీ వ్యాఖ్య రాయండి