Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

చిక్కుల్లో తాంబే: అష్రాపుల్‌తో కలిసి టీ20 మ్యాచ్‌లో

Posted by:
Published: Thursday, August 6, 2015, 12:00 [IST]

న్యూఢిల్లీ: రాజస్ధాన్ రాయల్స్‌కు చెందిన వెటరన్ లెగ్ స్పిన్నర్ ప్రవీణ్ తాంబే తాజాగా వివాదంలో చిక్కుకున్నాడు. ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) అనుమతి లేకుండానే అమెరికాలోని న్యూయార్క్‌లో ఓ టీ20 టోర్నీ ఆడాడు.

ఇదేమంత పెద్ద నేరం కాకపోయినా, అతడితో కలిసి మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో వేటుపడిన బంగ్లాదేశ్ క్రికెటర్ మహ్మద్ అష్రాపుల్ అడడమే వివాదాస్పదమవుతోంది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (2013) లో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు అంగీకరించిన మహ్మద్ అష్రాపుల్‌పై బంగ్లా క్రికెట్ బోర్డు ఐదేళ్లు నిషేధం విధించింది.

 Tambe in trouble playing T20 game with Ashraful

అమెరికాలో జరిగిన లారెన్‌ హిల్‌ క్రికెట్‌ టోర్నీలో గత నెల 27న బుల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌత్‌ గుజరాత్‌ సీసీ జూనియర్స్‌ తరఫున తాంబే, అష్రాపుల్ ఆడినట్లు సమాచారం. అనధికార టోర్నీ అనుకుని తాను ఎంసీఏ అనుమతి తీసుకోలేదని తాంబే చెప్పాడు.

అంతేకాదు తాను ఆడే మ్యాచ్‌లో అష్రాపుల్ ఆడుతున్నాడన్న సంగతి తనకు గ్రౌండ్‌లోకి వెళ్లిన తర్వాతే తెలిసిందన్నాడు. ఇంగ్లాండ్‌లో లివర్‌పూల్ లీగ్‌లో ఆడుతున్న తాంబే జులై 23-31 మధ్య విరామం తీసుకుని అమెరికా వెళ్లాడు. తాంబే చేసిన పనికి గాను వర్కింగ్ కమిటీ సమావేశంలో చర్చించాకే అతనిపై నిర్ణయం తీసుకుంటామని ఎంసీఏ సంయుక్త కార్యదర్శి పీవీ శెట్టి చెప్పారు.

English summary
Veteran Rajasthan Royals leg-spinner Praveen Tambe has come under spotlight after it was learnt that he had played an unsanctioned T20 match in the United States alongside tainted Bangladeshi cricket Mohammed Ashraful, who is banned on charges of match-fixing.
మీ వ్యాఖ్య రాయండి