Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

దుమ్మెత్తిపోసిన సొంత మీడియా, ఆసిస్ చెత్త రికార్డ్‌లివే

Posted by:
Updated: Friday, August 7, 2015, 15:43 [IST]

సిడ్నీ: స్టూవర్ట్‌ బ్రాడ్‌ దెబ్బకు 60 పరుగులకే కుప్పకూలిన ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు టెస్టు ప్రదర్శన పైన ఆ దేశ మీడియా తీవ్రంగా స్పందించింది. టెస్టు బృందానికి అంతటికీ సిటిజన్‌షిప్‌ ఉండకూడదంటూ రాసింది.

ఇది చాలా అవమానకర, అపకీర్తిపాలు చేసే ప్రదర్శన అంటూ మండిపడింది. ఇంగ్లండ్‌లోని ట్రెంట్ బ్రిడ్జ్‌లో ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య గురువారం జరిగిన యాషెస్‌ నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్సులో ఆస్ట్రేలియా జట్టు స్టూవర్ట్‌ బ్రాడ్‌ ధాటికి 18.23 ఓవర్లలో 60 పరుగులకే కుప్పకూలింది.

అదే పిచ్ పైన ఇంగ్లండ్‌ జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా మీడియా క్రికెట్‌కు రిప్ అంటూ పేర్కొంది.

Australian media stick boot into Michael Clarke and his players

గురువారం నాడు జరిగిన టెస్టులో బ్రాడ్ ధాటికి ఆసిస్ కుప్పకూలిన విషయం తెలిసిందే.

  • కేవలం 18.3 ఓవర్లలోనే.. 60 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది.
  • 9.3-5-15-8.. ఇదీ బ్రాడ్ గణాంకాలు. కేవలం 15 పరుగులు ఇచ్చి 8 వికెట్లు తీయడం గమనార్హం.
  • మొత్త ఆస్ట్రేలియా ఇన్నింగ్సులో రెండంకెల స్కోర్ చేసింది ఇద్దరే. ఖాతా తెరవకుండా ముగ్గురు పెవిలియన్ చేరారు.
  • ఆస్ట్రేలియా ఇన్నింగ్సులో ఎక్కువ పరుగులు ఎక్స్‌ట్రా ద్వారా వచ్చాయి. టాప్ స్కోరర్.. జాన్సన్ 13 పరుగులు చేయగా.. ఎక్స్ ట్రాల ద్వారా అంతకంటే ఒకటి ఎక్కువ 14 వచ్చాయి.
  • ఆస్ట్రేలియా వణికిపోయిన పిచ్ మీదే ఇంగ్లాండ్ దుమ్మురేపింది.
  • టెస్టు క్రికెట్లో ఇది ఏడో అత్యల్ప స్కోరు. గత 79 ఏళ్లలో ఆస్ట్రేలియాకు ఇది రెండో అత్యల్ప స్కోర్.
  • 2011లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచులో ఆ జట్టు 47 పరుగులకు కుప్పకూలింది.
  • లంచ్ లోపే ఆలౌట్ అవడం ఆస్ట్రేలియాకు ఇది రెండోసారి. ఆ జట్టు 1896లో ఇంగ్లాండ్ చేతిలో తొలి సెషన్లోనే 53 పరుగులకు ఆలౌట్ అయింది. ఇలా రెండుసార్లు లంచ్ లోపు ఆలౌటైన జట్టు ఆస్ట్రేలియానే.
  • ఆస్ట్రేలియా కేవలం 111 బంతులు ఆడింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అతి తక్కువ బంతుల్లో తొలి ఇన్నింగ్స్ ముగించిన జట్టు ఆస్ట్రేలియా. గత రికార్డు కూడా (113) ఆస్ట్రేలియాదే.
Story first published:  Friday, August 7, 2015, 15:41 [IST]
English summary
Ashes 2015: Australian media stick boot into Michael Clarke and his players
మీ వ్యాఖ్య రాయండి