Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

త్వరలోనే వస్తా: నెట్స్‌లో ప్రాక్టీస్ చేసిన యువీ

Published: Friday, August 7, 2015, 16:04 [IST]

న్యూఢిల్లీ: మూడు నెలల తర్వాత ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ నెట్‌లో ప్రాక్టీస్ చేశాడు. త్వరలోనే తాను మైదానంలో కనిపిస్తానని చెప్పాడు. 33ఏళ్ల ఈ ఆటగాడు చివరి సారిగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్)లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు తరపున ఆడాడు.

ప్రస్తుతం తాను నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నట్లు ట్వీట్టర్ ద్వారా తెలిపాడు యువరాజ్. ‘నెట్స్‌లో ప్రాక్టీస్ చేయడం చాలా మంచి అనుభూతిని ఇచ్చింది. త్వరలోనే వస్తా' అని యువరాజ్ సింగ్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నాడు. ఇన్‌స్టాగ్రాంలో ఆ ప్రాక్టీస్‌కు వీడియోలను పోస్ట్ చేశాడు.

'Coming soon', says Yuvraj Singh after returning to 'nets'

ఇటీవల ముగిసిన ఐపిఎల్ టోర్నీలో ఆడేందుకు రూ. 16కోట్లు అమ్ముడు పోయి ఈ సీజన్ వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా యువరాజ్ చరిత్ర సృష్టించాడు. అయితే ఈ టోర్నీలో యువరాజ్ అంతగా రాణించలేకపోయాడు. మే 17న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ అతను ఆడిన చివరి మ్యాచ్.

కాగా, ప్రస్తుతం యువరాజ్ సింగ్‌కు ఇండియా-ఎ జట్టులో కానీ, సీనియర్ జట్టైన భారత జాతీయ జట్టులో కానీ చోటు దక్కలేదు. అయితే తాను భారత జట్టులో స్థానం దక్కించుకుంటాననే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాడు యువరాజ్.

వచ్చే అక్టోబర్ నుంచి జరిగే రంజీ ట్రోఫీలో పంజాబ్ తరపున యువరాజ్ ఆడే అవకాశం ఉంది. కాగా, ఏపిల్ 2014 నుంచి టీమిండియాకు దూరంగా ఉంటున్నాడు. 40 అంతర్జాతీయ టెస్టులు, 293 వన్డేలు, 40ట్వంటీ20లను ఆడాడు.

Feels good to be back in the nets ! Coming soon 👊🏽👮🏻

A video posted by Yuvraj Singh (@groovi12) on

English summary
Nearly 3 months after his last competitive match, all-rounder Yuvraj Singh is back in the 'nets' and announced that he would be "coming soon".
మీ వ్యాఖ్య రాయండి