Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

పెట్టుబడి: 'బర్గర్' వ్యాపారంలోకి యువరాజ్

Posted by:
Published: Saturday, August 8, 2015, 13:20 [IST]

న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ బర్గర్‌ల వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. యువరాజ్ సింగ్‌కు చెందిన కంపెనీ యువుయ్‌కెన్ వెంచర్స్ అమెరికాలోని కార్ల్స్ జూనియర్ అనే బర్గర్ల చెయిన్ కంపెనీలో పెట్టుబడి పెట్టింది.

Yuvraj Singh invests in US burger chain

ఈ వారాంతంలో ఈ కంపెనీకి చెందిన మొదటి స్టోర్‌ను భారత్‌లో ప్రారంభించనుంది. కార్ల్స్ జూనియర్‌కు చెందిన ఈక్విటీల్లో యువరాజ్ సింగ్ పెట్టుబడి పెట్టాడు. అయితే ఎంత మొత్తంలో పెట్టుబడి పెట్టాడనే విషయం మాత్రం బయటకు రాలేదు.

పారిస్ హిల్టన్, కిమ్ కర్దాషియాన్‌లాంటి హాలీవుడ్ సెలబ్రిటీలు ఈ కంపెనీతో పనిచేస్తుండగా ఇకపై యువరాజ్ కూడా దీనికి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తాడు. గత నెలలో యువీ జెట్‌సెట్‌గో అనే ఆన్‌లైన్ కంపెనీలోనూ పెట్టుబడులు పెట్టాడు.

English summary
Cricketer Yuvraj Singh has now set his eyes on juicy burgers. Singh's company YouWeCan Ventures has invested in American burger chain Carl's Jr that is set to open its first store in India this weekend.
మీ వ్యాఖ్య రాయండి