Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

మోడీ మెయిల్‌ వల్లే సురేష్ రైనాకు విశ్రాంతి!

Published: Sunday, August 9, 2015, 12:30 [IST]

న్యూఢిల్లీ: టీమిండియా జింబాబ్వే పర్యటనకు డాషింగ్‌ బ్యాట్స్‌మన్‌ సురేష్‌ రైనాకు విశ్రాంతి ఇవ్వడంపై సరికొత్త విషయం వెలుగులోకొచ్చింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫిక్సింగ్‌ స్కాంలో రైనా కూడా ఉన్నాడని ఆరోపిస్తూ మాజీ కమిషనర్‌ లలిత్‌ మోడీ.. ఐసిసికి ఈ-మెయిల్‌ పంపిన విషయం ఇటీవల దుమారం లేపింది.

వాస్తవంగా జింబాబ్వే పర్యటనకుకు రైనాను కెప్టెన్‌గా ఎంపిక చేయాలి. కానీ లలిత్ మోడీ మెయిల్‌ బహిర్గతమైన నేపథ్యంలో బిసిసిఐ పెద్దలు కలగజేసుకుని రహానెను సారథిగా ఎంపిక చేసేలా వ్యవహరించారని సమాచారం. దీంతో కెప్టెన్సీతోపాటు జట్టులో కూడా రైనా స్థానం కోల్పోయాడు.

Suresh Raina ‘rested’ after his name pops up in Lalit Modi’s email to ICC

ఓ రియల్టర్‌ నుంచి రైనా, రవీంద్ర జడేజా, బ్రావో లంచాలు తీసుకున్నారని ఆరోపిస్తూ అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) సిఈఓ డేవిడ్ రిచర్సన్‌కు లలిత్ మోడీ మెయిల్‌ పంపించాడు.

జట్టు ఎంపిక (జూన్‌ 29)కు రెండు రోజుల ముందు రైనాపై ఆరోపణలొచ్చాయి. అప్పటికే అతడిని కెప్టెన్‌గా ఎంపిక చేయాలనుకున్న సెలెక్టర్లు.. బీసీసీఐ అధికారి ఆదేశాలతో నిర్ణయాన్ని మార్చుకున్నారని తెలిసింది. బీసీసీఐ నిబంధనల ప్రకారం.. అధ్యక్షుడు అనుమతి లేనిదే జట్టును ప్రకటించకూడదు.

English summary
Ajinkya Rahane wasn’t the first-choice captain for India’s recently concluded cricket tour of Zimbabwe. The selectors had initially picked Suresh Raina for the role but they had to “rest” him and name Rahane as captain after a top BCCI official intervened.
మీ వ్యాఖ్య రాయండి