Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

భూవివాదంలో భువనేశ్వర్ కుమార్‌కు బెదిరింపులు

Posted by:
Published: Monday, August 10, 2015, 10:17 [IST]

మీరట్: క్రికెటర్ భువనేశ్వర్ కుమార్, అతని తండ్రి కిరణ్ పాల్ సింగ్‌కు ఓ భూమి విషయమై బెదిరింపులు వచ్చినట్లు మీరట్ పోలీసులు ఆదివారం నాడు చెప్పారు. భారత క్రికెటర్‌ భువనేశ్వర్‌ కుమార్‌కు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఫోన్లు వచ్చాయని చెప్పారు.

కిరణ్ పాల్‌.. రణ్‌వీర్ సింగ్‌ అనే వ్యక్తి నుంచి రూ.80 లక్షలకు భూమి కొనుగోలు చేశాడు. ఆయన ఈ ఏప్రిల్లోనే మొత్తం డబ్బును ఇచ్చేశాడు. అయినప్పటికీ రణ్‌వీర్‌ ఇప్పటిదాకా భూమిని కిరణ్ పాల్‌ పేరిట బదిలీ చేయలేదు.

ప్రస్తుతం రణ్‌వీర్‌ ప్రస్తుతం ఒక హత్య కేసులో ఇరుక్కుని జైల్లో ఉన్నాడు. ఇచ్చిన డబ్బును అడిగితే ఇవ్వనన్నాడని, రణ్‌వీర్‌ తరఫువాళ్లే భువనేశ్వర్, ఆయన తండ్రిని బెదిరించి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసులో రణ్‌వీర్‌తో పాటు ఐదుగురిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

Cricketer Bhuvneshwar Kumar receives life threats in Meerut

కోహ్లీకి కలువితరణ సూచన

భారత టెస్ట్ కెప్టెన్ విరాట్‌ కోహ్లి విజయం కోసం తహతహలాడుతున్నాడని, ఐతే భారీ అంచనాల ఒత్తిడిని అతడు తట్టుకోవాలని శ్రీలంక మాజీ ఆటగాడు కలువితరణ అభిప్రాయపడ్డాడు.

భారత్‌పై భారీ అంచనాలున్నాయని, కోహ్లి కెప్టెన్‌గా ఎలా పని చేస్తాడోనని అభిమానులు చూస్తున్నారని, అతడు ఆ అంచనాల ఒత్తిడిని తట్టుకోవాల్సి ఉంటుందన్నాడు. కోహ్లి బాగా ఆడాలని, గెలవాలనే కసితో ఉంటాడనడంలో ఎలాంటి సందేహం లేదన్నాడు.

English summary
Cricketer Bhuvneshwar Kumar and his father have allegedly received life threats over a land-related dispute in the district, police said on Sunday,
మీ వ్యాఖ్య రాయండి