Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

తొలి టెస్టుకు ఓపెనర్ మురళీ విజయ్ దూరం

Published: Monday, August 10, 2015, 13:04 [IST]

కొలంబో: భారత ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ మురళీ విజయ్ శ్రీలంతో జరిగే తొలి టెస్ట్ మ్యాచు నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని టీమిండియా డైరెక్టర్ రవిశాస్త్రి ధృవీకరించాడు. తొడ కండరాల నొప్పి కారణంగా శ్రీలంక బోర్డ్ ప్రెసిడెంట్స్ లెవన్ జట్టుతో జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచులోనూ మురళీ విజయ్ బ్యాటింగ్ చేయలేదు.

ఆగస్టు 12న గాలేలో జరిగే తొలి టెస్టుకు కూడా మురళీ విజయ్ దూరంగా ఉండనున్నాడు. విజయ్ తొలి టెస్టుకు దూరం కావడంతో శిఖర్ ధావన్, కెఎల్ రాహుల్‌లు భారత ఓపెనర్లుగా బరిలో దిగనున్నారు.

India opener Murali Vijay ruled out of first Sri Lanka Test

డెంగ్యూ కారణంగా కెల్ రాహుల్ జూన్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచుకు దూరంగా ఉన్నాడు.

కాగా, 31ఏళ్ల మురళీ విజయ్ ఇప్పటి వరకు 32 టెస్టులు ఆడి 2వేల పరుగులు పూర్తి చేశాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచులో 150 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. భారత్ ప్రస్తుతం శ్రీలంకతో మూడు టెస్టులు ఆడనుంది.

English summary
India's opening batsman Murali Vijay has been ruled out of the 1st Test against Sri Lanka, Team Director Ravi Shastri confirmed to the media today.
మీ వ్యాఖ్య రాయండి