Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

10మంది ఆటగాళ్లకు ఫుడ్ ‌పాయిజన్: సౌతాఫ్రికా తరఫున భారత ఫీల్డర్

Posted by:
Published: Monday, August 10, 2015, 9:59 [IST]

చెన్నై: భారత్ - ఏ జట్టుతో సిరీస్ కోసం ఇండియా వచ్చిన దక్షిణాఫ్రికా - ఏ జట్టు ఆటగాళ్లు ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ఆసుపత్రిపాలయ్యారు. ఆదివారం నాడు చెన్నైలో మ్యాచ్ జరుగుతుండగానే ముగ్గురు ఆటగాళ్లు ఆసుపత్రిలో చేరారని ఆ జట్టు మేనేజ్‌మెంట్ చెప్పింది.

నగరంలోని ఓ మాల్‌లో శనివారం నాడు కొన్ని గంటల పాటు గడిపిన ఆ జట్టు ఆటగాళ్లు అక్కడే భోజనం చేసినట్లు సమాచారం. ఈ భోజనమే వారిని ఆసుపత్రి పాల్జేసిందని సమాచారం. శనివారం రాత్రే కొంతమంది అస్వస్థతకు గురయ్యారు.

మరికొందరు ఆదివారం మ్యాచ్ జరుగుతున్న సమయంలో మైదానం వీడారు. ఇక సెంచరీ చేసిన ఆ జట్టు స్టార్ ప్లేయర్ డికాక్, మ్యాచ్ ముగిసీ ముగియగానే ఆసుపత్రిలో చేరాడు. మొత్తం పదిమంది ఆటగాళ్లు విషాహారం కారణంగా అస్వస్థతకు గురయ్యారు.

Upset tummies upset schedule after 10 South Africa 'A' players are hospitalised

నలుగురు ఆటగాళ్లు అస్వస్థతోనే ఉదయం మ్యాచ్‌లో బరిలోకి దిగారు. ఐతే మ్యాచ్‌ మధ్యలో ఒక్కొక్కరుగా ముగ్గురు మైదానాన్ని వీడి, ఆసుపత్రికి వెళ్లారు. తుది జట్టులో లోని మరో ఆరుగురు కూడా ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది.

మ్యాచ్‌ ఆడుతున్న ముగ్గురు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు మైదానాన్ని వీడటం, రిజర్వ్‌ ఆటగాళ్లు కూడా ఆసుపత్రిలో చేరాల్సి రావడంతో దక్షిణాఫ్రికా తరఫున భారత ఫీల్డర్‌ ఫీల్డింగ్‌ చేయాల్సి వచ్చింది. సబ్‌స్టిట్యూట్‌లు అందుబాటులో లేక ముందు వీడియో అనలిస్ట్‌ హెండ్రిక్స్‌ కొయిర్ట్‌జెన్‌ను ఫీల్డింగ్‌కు దించిన సఫారీ జట్టు ఆ తర్వాత ఫీల్డర్‌ కోసం భారత్‌ - ఎ జట్టును అభ్యర్థించింది.

దీంతో మన్‌దీప్ సింగ్‌ దక్షిణాఫ్రికా జెర్సీ వేసుకుని ఫీల్డింగ్‌ చేశాడు. మొత్తం పది మంది సఫారీ ఆటగాళ్లు ఆసుపత్రిలో చేరడంతో టోర్నీ షెడ్యూల్‌ కూడా మార్చాల్సి వచ్చింది. సోమవారం ఆస్ట్రేలియాతో దక్షిణాఫ్రికా తలపడాల్సి ఉండగా మంగళవారం జరగాల్సిన భారత్‌ - ఆసీస్‌ మ్యాచ్‌ను ముందు రోజే నిర్వహించనున్నారు.

English summary
The infamous Delhi belly has struck the touring South Africans in Chennai.
మీ వ్యాఖ్య రాయండి