Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

టీ20 ప్రపంచకప్: ఒకే గ్రూప్‌లో భారత్, పాక్!

Published: Tuesday, August 11, 2015, 10:56 [IST]

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మన దేశంలో జరిగే ట్వంటీ20 ప్రపంచకప్‌ టోర్నీలో భారత్‌, పాకిస్థాన్‌ ఒకే గ్రూప్‌లో తలపడే అవకాశాలున్నాయి. వెస్టిండీస్‌ కూడా అదే గ్రూప్‌లో ఉంటుంది. ఐసిసి ఈ మేరకు షెడ్యూల్‌ ఖరారు చేసిందని సమాచారం.

మరోవైపు మహారాష్ట్రలో (ముంబై, నాగ్‌పూర్‌) జరిగే మ్యాచ్‌ల్లో భద్రతా కారణాల దృష్ట్యా పాక్‌ను ఆడించకూడదని బీసిసిఐ నిర్ణయించుకుంది. మహారాష్ట్రలో పాక్‌ ఆడితే శివసేన లాంటి పార్టీల వల్ల శాంతిభద్రతల సమస్య తలెత్తవచ్చని బిసిసిఐ భావిస్తోంది.

India, Pakistan and West Indies in same group for ICC World T20 2016: Reports

ఏప్రిల్ 3న జరిగే ఫైనల్‌కు ఈడెన్ గార్డెన్స్ వేదికవనుండగా, మిగతా మ్యాచ్‌లకు చెన్నై, ధర్మశాల, మొహాలీ, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ ఆతిథ్యమివ్వనున్నాయి.

ఇంగ్లాండ్‌లో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌:

2017లో ఇంగ్లాండ్‌ బోర్డు ఆధ్వర్యంలో తొలి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ జరగనుంది. వార్షిక సమావేశంలో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఐదారు వేదికల్లో ఛాంపియన్‌షిప్‌ జరగొచ్చు.

English summary
The ICC World Twenty20 (T20) 2016, which is scheduled to be held in India is likely to witness Pakistan, West Indies and the hosts play it out in the same group, according to media reports. However, according to media reports, Pakistan will not be playing in Mumbai and Nagpur.
మీ వ్యాఖ్య రాయండి