Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

లంతో తొలి టెస్టుకు సిద్ధంగా ఉన్నాం: కోహ్లీ

Published: Tuesday, August 11, 2015, 15:15 [IST]

గాలే: శ్రీలంకతో సిరీస్‌కు సిద్ధంగా ఉన్నామని భారత్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. శ్రీలంకతో జరగనున్న మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ బుధవారం గాలేలో జరగనుంది. ఈ సందర్భంగా కోహ్లీ మీడియాతో మాట్లాడాడు.

శ్రీలంకతో పోరుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని, టెస్టు క్రికెట్‌లో సత్తా చాటడానికి యువ క్రికెటర్లకు ఈ సిరీస్ సదవకాశమని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. బుధవారం జరగబోయే మ్యాచ్‌లో ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగనున్నట్లు తెలిపారు.

కాగా, శ్రీలంకతో భారత్ టెస్ట్‌ సిరీస్ నెగ్గి రెండు దశాబ్దాలు కావస్తున్న తరుణంలో ఈ సిరీస్‌ను ఎలాగైనా నెగ్గాలన్న కసితో కోహ్లీ ఉంది. అంతేగాక, కెప్టెన్‌గా కోహ్లీకి ఈ సిరీస్ పూర్తిస్థాయిది కావడంతో ఈ సిరీస్‌ని గెలిచి తన నాయకత్వ స్థానానికి సుస్థిర బాటలు వేసుకోవాలని ఆరాటపడుతున్నాడు. అయితే ఇవి ఎంత మేరకు ఫలిస్తాయో ఈ టెస్ట్ సిరీస్ తేల్చనుంది.

Preview: 1st Test: Sri Lanka Vs India in Galle

కాగా, శ్రీలంక కూడా సొంతగడ్డపై సిరీస్ గెలవాలనే పట్టుదలతో కనిపిస్తోంది. శ్రీలంక జట్టు కూడా పటిష్టంగా కనిపిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో శ్రీలంక జట్టును తక్కువ అంచనా వేయలేమని కూడా టీమిండియా భావిస్తోంది. ఈ రెండు జట్లు బలమైనవే కావడంతో టెస్ట్ సిరీస్ ఉత్కంఠ మధ్య కొనసాగే అవకాశం లేకపోలేదు.

ఇది ఇలా ఉండగా, గాలేలో ప్రారంభమయ్యే తొలి మ్యాచ్ నుంచి టీమిండియా ఓపెనర్ మురళీ విజయ్ తప్పుకున్న విషయం తెలిసిందే. చీలమండ గాయంతో బాధపడుతున్న విజయ్ ఇంకా పూర్తిగా కోలుకోకపోవడమే ఇందుకు కారణం. దీంతో తొలి టెస్టులో భారత జట్టు శిఖర్ ధావన్, కెఎల్ రాహుల్‌లను ఓపెనర్లుగా దిగే అవకాశం ఉంది.

‘చీలమండ గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న విజయ్ ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదు. కనుక తొలి టెస్టులో మేము అతడిని బరిలోకి దించదలుచుకోలేదు. సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడే సామర్ధ్యంతో ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న విజయ్ దూరమవడం మా జట్టుకు పెద్ద ఎదురుదెబ్బే' అని టీమిండియా డైరెక్టర్ రవిశాస్రి పేర్కొన్నారు.

భారత టెస్ట్ జట్టు:

విరాట్ కోహ్లీ (కెప్టెన్), శిఖర్ ధావన్, మురళీ విజయ్, కెఎల్ రాహుల్, ఛటేశ్వర్ పుజారా, అజింక్య రహానే, రోహిత్ శర్మ, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), హర్భజన్ సింగ్, అశ్విన్, ఉమేష్ యాదవ్, ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, అమిత్ మిశ్రా, వరుణ్ ఆరోన్ .

శ్రీలంక జట్టు:

ఏంజిలో మాథ్యూస్ (కెప్టెన్), లహిరు థిరిమన్నె(వైస్-కెప్టెన్), కౌశల్ సిల్వా, దిముత్ కరునరత్నే, కుమార్ సంగక్కర, దినేష్ చందిమల్, ఉపుల్ తరంగ, జెహన్ ముబారక్, కుసల్ పెరీరా, రంగన్ హెరాత్, దిల్రూవన్ పెరీరా, థిరిండు కౌశల్, నువాన్ ప్రదీప్, ధమ్మిక ఫెర్నాండో, విశ్వ ఫెర్నాండో, దుశ్మంత చమీర.

English summary
Virat Kohli's aggressive strategy to deploy five specialist bowlers will be tested when India go into the 3-match Test series against Sri Lanka here tomorrow (August 12), hoping to end a 22-year-old wait for a series triumph on Sri Lankan soil.
మీ వ్యాఖ్య రాయండి