Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

కోహ్లీయే బెస్ట్, శ్రీలంక పైన 'సంగక్కర' ఒత్తిడి: గవాస్కర్

Posted by:
Published: Wednesday, August 12, 2015, 13:15 [IST]

న్యూఢిల్లీ: భారత టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగడం మంచిదని భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఫస్ట్ డౌన్‌లో రోహిత్‌ శర్మ కంటే కోహ్లీ దిగడమే జట్టుకు ప్రయోజనమని సూచించాడు.

తుది జట్టులో ఛటేశ్వర పుజార కంటే రోహిత్ శర్మకు చోటు దక్కడమే సమంజసమని చెప్పాడు. అయితే మూడో స్థానానికి విరాట్ కోహ్లీనే సరిపోతాడన్నాడు. ఆ స్థానంలో కోహ్లీ వస్తే, మిగతా బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి ఉండదని అభిప్రాయపడ్డాడు.

 Sunil Gavaskar wants Virat Kohli to bat at No. 3 in 1st Test

పాకిస్తాన్ చేతిలో సిరీస్ ఓటమితోపాటు సంగక్కరకు ఘన వీడ్కోలు పలకాలనే ఒత్తిడిలో శ్రీలంక జట్టు ఉందని చెప్పాడు. తద్వారా సిరీస్‌ను గెలుపుతో ఆరంభిస్తే, కోహ్లీసేన పని సులువు అవుతుందని సునీల్ గవాస్కర్ అన్నాడు.

English summary
Rohit Sharma is set to play at number three in the first Test against Sri Lanka beginning tomorrow (August 12) but Sunil Gavaskar feels India captain Virat Kohli should bat at the crucial position.
మీ వ్యాఖ్య రాయండి